Saturday, May 4, 2024
- Advertisement -

ఆర్టీసీ బ‌స్సులో నాని కృష్ణార్జున యుద్ధం సినిమా

- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ గ‌త గురువారం రిలీజ్ అయ్యి యావ‌రేజ్ టాక్‌తో న‌డుస్తున్న‌ప్ప‌టికి క‌లెక్ష‌న్స్ బాగానే ఉన్నాయి.ఇప్పుడా  ఆ సినిమా పైర‌సీ టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శితమవడం వివాదాస్పదమైంది.బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించి మంత్రి కేటీఆర్‌, హీరో నానిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.ప్రభుత్వ సంస్థల్లోనే ఇలా యథేచ్చగా పైరసీ జరుగుతుంటే.. ఇక పైరసీ నియంత్రించాలంటూ సామ్యానులను ఎలా అడుగుతారని ప్రశ్నించాడు. దీనిపై కేటీఆర్ వెంట‌నే స్పందించారు.ఈ ఉదంతంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీకి చెందిన ఓ గరుడ వోల్వో బస్సు ఏప్రిల్ 14 రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ బస్సులో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా పైరసీ కాపీని ప్రదర్శించారు. సునీల్ అనే ప్రయాణికుడు టీవీ స్క్రీన్‌షాట్‌ తీసి ఆదివారం ఉదయం ట్విటర్ ద్వారా కేటీఆర్‌కు షేర్ చేశాడు. ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్ ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎండీని ఆదేశించారు.మేర్లపాక గాంధీ దర్శకత్పం వ‌హించిన ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేసిన సంగ‌తి తెలిసందే.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -