Friday, May 10, 2024
- Advertisement -

వ‌ర్మ‌కు త్వ‌ర‌లోనే బిగ్‌షాక్‌….

- Advertisement -

వివాదాస్ప‌ద ద‌ర్శుకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌తో బంధాలు తెగిపోయిన‌ట్టేన‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇన్నాన‌ల్లు వ‌ర్మ ఏం మాట్లాడినా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కాని శ్రీరెడ్డి ద్వారా ప‌వ‌న్ వాల్ల అమ్మ‌ను తిట్టించిన వ్య‌వ‌హారం వ‌ర్మ మెడ‌కు చుట్టుకుంది.

ప్రస్తుతం వర్మకు నిరసనగా టాలీవుడ్ మొత్తం ఏకమై అధికారికంగా కాకపోయినా, అనధికారికంగా అయినా వర్మపై వేటు తప్పకపోవచ్చు. ఇండస్ట్రీ మొత్తం అతడ్ని వెలివేయడం గ్యారెంటీ. వర్మపై వేటు వేసే ఆలోచనలో ఉన్నారు సినీ పెద్ద‌లు. పవన్ తల్లిపై వర్మ చేయించిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టాలీవుడ్ మొత్తం ఒక్కటైంది. నిర్మాతలు, దర్శకులు, నటీనటులంతా మెగా కాంపౌండ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ-అఖిల్ కాంబోలో రావాల్సిన సినిమాను ఆపేయడం మంచిదనే ఉద్దేశానికి నాగ్ వచ్చినట్టు తెలుస్తోంది.

నాగార్జున ఆఫీసర్ సినిమాను సపోర్ట్ చెయ్యడానికి కొందరి ముందుకు వచ్చినా మరికొందరు రాకపోవచ్చు. అసలే ప్రీ-రిలీజ్ జరగక ఇబ్బందుల్లో ఉన్న ఈ సినిమా, వర్మ చేసిన తింగరి పనితో మరింత సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోయింది. ఇలాంటి టైమ్ లో అఖిల్ ను హీరోగా పెట్టి వర్మ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా నిర్మిస్తే, ఇండస్ట్రీ మొత్తం నాగ్ ను టార్గెట్ చేస్తుంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో నాగ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -