కథువా, ఉన్నావ్ చిన్నారుల రేప్ ఘటనలతో కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చినట్లుంది.లాంటి ఘటనలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. 12 ఏళ్ల లోపు వయస్సు కల్గిన చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణదండన విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై పెద్దఎత్తున దుమారం రేగుతోన్న వేళ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.తాజాగా ఇండోర్‌లోనూ నెలల వయసున్న ఓ చిన్నారిని అపహరించిన కామాంధుడు.. రేప్ చేసి దారుణంగా హతమార్చాడు.
12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి నేరతీవ్రత మేరకు మరణదండన విధించేలా శిక్షాస్మృతిలోని మార్పులు చేసేందుకు కేంద్ర న్యాయశాఖ యోచిస్తున్నట్టు ఓ కేసుకు సంబంధించి నిన్న సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. కేంద్రం నిర్ణయంతో 12 ఏళ్ల చిన్నారులపై రేప్ చేసిన వారికి ఉరిశిక్ష విధించేందుకు వీలుగా క్రిమినిల్ లాను మార్చనున్నారు.కథువాలో చిన్నారిని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హతమార్చడం..దేశ వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది.
