Wednesday, May 15, 2024
- Advertisement -

ఆర్య కి తెలుగు లో డబ్బింగ్ ఎవరో తెలుసా ?

- Advertisement -

తెలుగు తమిళ ద్విభాషా చిత్రం గా రూపొందిన సైజ్ జీరో చిత్రం ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదల కి సిద్దం అవుతోంది,

డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్యాచ్ వర్క్ మీద కూడా దృష్టి పెట్టారు.

ఆర్య – అనుష్క జంటగా రూపొందిన ఈ సినిమా లో ఆర్య కి తెలుగు లో డబ్బింగ్ చెప్పడం కోసం తెలుగు యంగ్ హీరో నందూ ముందుకు రావడం విశేషం, పీవీపీ నిర్మాణ సారధ్యం లో వస్తున్న ఈ సినిమా కి గత రెండు వారాల నుంచీ డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనుష్క డబ్బింగ్ పూర్తయిన తరవాత ఆర్య కోసం తెలుగు లో ఎవరు చెబుతారు అని దర్శకుడి బృందం ఆరా తీసీ తీసీ మరీ నందూ ని పిలిపించారు.

ఈ విషయం నందూ నే స్వయంగా తెలుపుతూ పీవీపీ లాంటి నిర్మాణ సంస్థ తీస్తున్న ఒక డిఫరెంట్ సినిమా లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల కి సిద్దం చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -