Tuesday, May 14, 2024
- Advertisement -

వాల్మీకి లో తెలుగు అమ్మాయి ఎందుకంటే

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి హరీష్ శంకర్ ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు. తమిళం లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన జిగర్తాండ అనే సినిమా ని తెలుగు లో వాల్మీకి అనే పేరు తో తీస్తున్నాడు హరీష్. ఈ సినిమా కి ప్రస్తుతం మంచి బజ్ ఉంది. వరుణ్ తేజ్ ని మొట్ట మొదటి సారి ఒక కొత్త లుక్ లో పరిచయం చేయనున్నాడు హరీష్. ఈ సినిమా లో అథర్వ మురళి అనే తమిళ హీరో తెరంగేట్రం చేయనున్నాడు. అలాగే ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ పాత్ర పోషించనుంది.

ఇకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాట కోసం చాల మంది ని అనుకోని చివరికి డింపుల్ హయాతి అనే ఒక తెలుగు అమ్మాయి ని సెలెక్ట్ చేసాడు హరీష్. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన అప్పుడే వెలువడినా తెలుగు అమ్మాయి ని తీసుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన వ్యూహం ఉందట.

సాధారణం గా ప్రస్తుతం తెలుగు పరిశ్రమ లో ఐటెం సాంగ్స్, స్పెషన్ సాంగ్స్ క్రేజ్ తగ్గిపోతుంది. అందుకని ఈ తరుణం లో ఇలాంటి పాట కి ఒక తెలుగు అమ్మాయి అయితే బాగుంటుంది అని, కొంత క్రేజ్ కూడా వస్తుంది అని భావించి ఈ హాట్ భామ ని సినిమా లో కి తీసుకున్నాడట హరీష్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -