ప్రస్తుతం దేశంలో గోహత్య గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది జైశ్రీరామ్ పదం వల్ల హత్యలు జరుగుతున్నాయి అని కామెంట్ చేశారు. మరి కొందరేమో దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధ్యత చేపట్టాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. నకిలీ మేధావులు మళ్లీ సకిలించారు అంటూ సెటైరికల్ గా అనంత శ్రీరామ్ ఫేస్బుక్ లో పెద్ద పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెటైరికల్ గా ఉన్న ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. “జైశ్రీరామ్ అనే పదం వల్ల ఎన్నో దారుణ కాండలు జరిగిపోతున్నాయట, అందువల్ల ఆ పదం వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనట, అంటే ఇప్పుడు శ్రీరామ్ అనే పదాన్ని నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా” అంటూ ప్రశ్నించారు అనంత శ్రీరామ్. దీని కింద నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
