Wednesday, May 8, 2024
- Advertisement -

ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి కేంద్రం గుడ్ న్యూస్‌….

- Advertisement -

దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరిక‌ట్టే విధానంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారికి కేంద్రం తీపిక‌బురు అందించింది. జీఎస్టీ మండలి ఈరోజు ఢిల్లీలో సమావేశమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. విద్యుత్తు వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వాహనాలపై 12శాతం, ఛార్జర్లపై 18శాతం జీఎస్టీ ఉన్న విషయం తెలిసిందే. తాజా రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్‌ ప్రకటించింది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకుంటే వాటిపై కూడా జీఎస్టీని మినహాయించాలని ఈ భేటీలో తీర్మానించినట్లు చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -