Sunday, May 5, 2024
- Advertisement -

ఈ వారం టాలీవుడ్ కు ఫిలిం ఫెస్ట్

- Advertisement -

ఈవారం చిన్న చిత్రాలు చెడుగుడు ఆడుకోవడం కోసం కాచుకు కూర్చున్నాయి. వరుసగా ప్రతివారం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి. కాని ఈవారం మాత్రం సినిమా మరోలా ఉంది. చిన్న సినిమాల సంగతేంటో ఈవీక్ తేలిపోనుంది. అయితే వచ్చే చిత్రాలలో కొన్ని పసందైన చిత్రాలు, ఓ భారీ బడ్జెట్ చిత్రం క్యూలో ఉన్నాయి.

ఐతే ఈవారం దాదాపుగా అరడజను చిత్రాలు రిలీజ్ కు క్యూ కట్టేసాయి. నవంబర్ 3న పి.ఎస్.వి. గరుడవేగ రిలీజ్ అవుతుంది. అదే రోజు హెబ్బా పటేల్ ఏంజిల్ చిత్రం విడుదలవుతుంది. ఇక నవంబర్ 3న ప్రభాకర్ డైరెక్షన్లో నెక్స్ట్ నువ్వే ఫిలిం రాబోతోంది,. ఈసినిమాలో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా చేశాడు.

సౌత్ హ్యాండ్సమ్ సిద్ధర్థ్ సైతం నవంబర్ 3న గృహం లాంటి హారర్ చిత్రంతో మన ముందుకు వస్తానంటున్నాడు. ఇవే కాకుండా ఇంకొన్ని చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవారం ఫిలిం ఫెస్ట్ కు థియేటర్లు రెఢీ అయిపోతున్నాయి. దాదాపు ఎంతలేదన్నా అరడజను చిత్రాలు రిలీజ్ కు నోచుకున్నాయి. ఆక్సిజన్ కూడా ఈవారం వచ్చేదే. ధైర్యం చాలక వచ్చేవారం రిలీజ్ పెట్టుకున్నారు. ఈమధ్యకాలంలో చిన్న చిత్రాలలో ఇంతటి క్రేజ్ ఉన్న సినిమాలు ఇంతలా ఒకసారి జనాల ముందుకు రావడం ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -