ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నటులు మరణించిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ఓ సీరియల్‌లో నటిస్తున్నారు భార్గవి (20), అనుషారెడ్డి (21). తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వీరిద్దరు. అయితే షూటింగ్ కోసం వీరు సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు. అనంతగిరి గుట్టలపై షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు.
తిరుగు ప్రయాణంలో మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్ద వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న భార్గవి (20),అనుషారెడ్డి (21) అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ చక్రితో పాటు మరో వ్యక్తి వినయ్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. భార్గవి,అనుషారెడ్డిల మరణంతో టీవీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నటులు మృతి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -