ఘోర ప్రమాదం.. ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు దుర్మరణం

- Advertisement -

హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ఇటీవల జరిగిన యాక్సిండెంట్స్‌లను మరువక ముందే శనివారం ఉదయం మరో కారు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళుతున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు కాగా మరొకరిని బ్యాంకు ఉద్యోగిగా గుర్తించారు.

గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ రోడ్డులో అతి వేగంగా దూసుకువెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మానస (22), మానస (21) జూనియర్‌ ఆర్టిస్టుగా గుర్తించారు. మరొక వ్యక్తి అబ్దుల్‌ రహీమ్‌ బ్యాంకు ఉద్యోగి. మరో జూనియర్‌ ఆర్టిస్టు సిద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

కాగా వీరంతా అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌ లో ఉంటున్నారు. అబ్దుల్‌ రహీమ్‌ మదాపూర్‌లోని యాక్సిస్‌ బ్యాంకులో పని చేస్తున్నాడు. తెల్లవారు జామును 4 గంటల ప్రాంతంతో ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరంతా ఎ‍క్కడి నుంచి నగరానికి వస్తున్నారు అనే దానిపై దర్యాప్తు సాగుతోంది.

మోత్కుపల్లికి మొండిచేయి ఎందుకంటే..?

నాగచైతన్య వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా..!

ఒమైక్రాన్ ఎక్కడ పుట్టింది..? పుట్టుకకు కారణం ఏంటీ..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -