- Advertisement -

విజయ్‌..జన నాయకన్ అప్‌డేట్!

- Advertisement -

కొలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయకన్’ 2026లో విడుదల కానున్న అత్యంత ఆసక్తి కర చిత్రాల్లో ఒకటి అని చెప్పాలి. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేస్తున్న చివరి సినిమా ఇదేననే ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

జన నాయకన్ సినిమా, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ అధికారిక రీమేక్ అన్న వార్తలు టాలీవుడ్, కొలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజా సమాచార ప్రకారం, ఈ సినిమాలో దాదాపు 60 శాతం సన్నివేశాలు భగవంత్ కేసరి నుంచి అనుసరించినట్లుగా తెలుస్తోంది. అలాగే జన నాయకన్ సినిమాలో విజయ్ పాత్ర పేరు దళపతి వెట్రి కొండన్ అని, ఇది బాలకృష్ణ పాత్ర పేరు “నెలకొండ భగవంత్ కేసరి”తో చాలా దగ్గరగా అనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు హెచ్. వినోత్ ఈ సినిమాలో థలపతి అభిమానులను అలరించే మాస్ ఎలిమెంట్స్‌ను విస్తారంగా చేర్చినట్లు సమాచారం. జన నాయకన్ పూర్తిస్థాయి మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమిత బైజు కథానాయికలుగా నటిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -