Saturday, May 11, 2024
- Advertisement -

అల్లూ అర్జున్ కి తమన్ ‘సరైన’ మ్యూజిక్

- Advertisement -

యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి బరువైన కథా చిత్రాల వరకూ ఎలాంటి సినిమాకైకా మ్యూజిక్ ఇవ్వగల మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అల్లు అర్జున్ సినిమా “సరైనోడు” కోసం సూపర్ మ్యూజిక్ ఇస్తున్నాడు అని సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున అల్ట్రా స్టైలిష్ లుక్ లో సూపర్ యాక్షన్ సీన్లతో బోయపాటి స్క్రిప్ట్ సూపర్బ్ గా వచ్చింది.

దీనికి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఎమోషనల్ సీన్లని కూడా బాగా తీస్తున్నారట. కొన్ని పాటలు సైతం రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యంతో చాలా బాగా వచ్చాయి అని వాటికి తమన్ మ్యూజిక్ కలిస్తే మరొక రేస్ గుర్రం లాంటి ఆల్బం రాబోతోంది అన్నమాట. అల్లు అర్జున్ అండ్ టీం రాజమండ్రిలో సందడి చేస్తుంటే, ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ తన టీంతో హైదరాబాద్ లో సందడి చేస్తున్నాడు.

ఒక ఫామిలీ సాంగ్ కి ఇప్పటివరకూ మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఇప్పుడు వరసగా రెండు డ్యూయెట్ ల మీద దృష్టి పెట్టాడు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది, ఆదర్శ్ బాలకృష్ణలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -