Tuesday, May 21, 2024
- Advertisement -

దట్ ఈజ్ అల్లూ అర్జున్

- Advertisement -

బన్నీ గొప్ప మనసును గురించిన టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో బన్నీ మాట్లాడిన తీరుకి అంతా ఆయనని అభినందిస్తూ వున్నారు.

ఈ సినిమా విడుదల రోజునే ఇందులో గోన గన్నారెడ్డిగా బన్నీ అద్భుతంగా నటించాడనే టాక్ వచ్చింది. అందరూ కూడా ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ అన్నారు. ఆయన పాత్ర ఈ సినిమాను నిలబెట్టిందని చెప్పారు.

అయితే తన పాత్రకి అంతగా పేరొచ్చినా, దాని గురించి ఆయన పెద్దగా చెప్పుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ సినిమాలో ఎవరి పాత్రకి మంచి పేరు వచ్చినా, హీరో మాత్రం అనుష్కయేనని అన్నాడు. ఈ సినిమా కోసం తాను 30 రోజులు కష్టపడితే, అనుష్క 3 సంవత్సరాలు కష్టపడిందని చెప్పాడు. తాను గోన గన్నారెడ్డిగా ఎలా నటించాననే విషయం అటుంచితే, తనకి ఆ పాత్రని గుణశేఖర్ ఇవ్వడం గొప్ప విషయమని అన్నాడు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశాడు. బన్నీలోని పరిపక్వతకి ఆయన మాటలే నిదర్శనమంటూ, అంతా ఆయన గురించే చెప్పుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -