” ప్రత్యేక హోదా ” కోసం జగన్ మోహన్ రెడ్డి చేసిన దీక్ష ఎంతవరకూ జనాల్లోకి వెళ్ళింది వారు అనుకున్న రీతి లో ఈ దీక్ష సాగిందా లేదా అనేదాని మీద తీవ్రమైన మధనం చేస్తున్నాయి వై కా పా శ్రేణులు. జగన్ అనుకున్నట్టుగా లేదా అంతా ఊహించినట్టు గానే కేంద్రం ఈ దీక్ష వైపు చూడ్డం కూడా జరగదు.
అది అనుకున్నట్టే జరిగింది. కానీ జానాలలో తమ పార్టీ ఉనికి తో పాటు తాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించే విషయం లో ప్రభుత్వం కంటే ఎంత చిత్త శుద్ధిగా ఉన్నాం అనేది వారికి చేరిందా లేదా అనేది ముఖ్య విషయం గా వారు ఆలోచిస్తున్నారు.
సాక్షి ఛానల్ లో తప్ప ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి దీక్ష ని సరిగ్గా ప్రసారం చెయ్యలేదు అనేది వై కా పా వారు జీర్ణించుకోలేక పోతున్నారు . ఒకప్పుడు ప్రతిపక్షానికీ అధికార పక్షానికీ ఇద్దరికీ ఒకే రకమైన విలువ ఇచ్చే మీడియా ఇప్పుడు పూర్తిగా బయాస్ద్ గా తయారు అయ్యింది అనేది జగన్ వర్గం ఆరోపణ.
పోరాటాన్నీ మళ్లీ పట్టాలెక్కించాలా.. లేదంటే ముగించాలా అని ఆలోచిస్తున్నారు. నిజానికి జగన్ పోరాటాన్ని ఉద్ధృతం చేసి చివర్లో దీక్ష చేస్తే బాగుండేది. కానీ పోలీసులు దీక్ష భగ్నం చేసే సమయం లో కనీస పోరాటం కూడా చెయ్యలేదు. జగన్ ఆసుపత్రికి వెళ్ళగా వారు కూడా నిన్న డిశ్చార్జ్ చేసారు ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారు జగన్. వై కా పా నేతలు మాత్రం ప్రత్యెక హోదా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు మీడియా తో . ఎలా కొనసాగుతుంది అనేది మాత్రం ఎవరూ చెప్పకపోవడం గమనార్హం.
అమరావతి శంకుస్థాపన హడావిడి అయ్యే దాకా ఎలాంటి ప్రయత్నం చేసిన మీడియా పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి కాస్త సమయం తీసుకుందాం అని అనుకుంటున్నారు జగన్ అని టాక్ మరి
