Friday, May 3, 2024
- Advertisement -

దటీజ్ రాజమౌళి…… ఎన్టీఆర్, చరణ్‌లను వేరే ఏ డైరెక్టర్ అయినా ఇలా ఒప్పించగలడా?

- Advertisement -

రాజమౌళి అంటే ఏంటో మరోసారి టాలీవుడ్ దర్శకులకు తెలిసొచ్చిన పరిస్థితి. అప్పుడెప్పుడో పాత డైరెక్టర్స్ దగ్గర హీరోలు పూర్తిగా బెండ్ అయి ఉండేవారు. డైరెక్టర్స్ మాటే చెల్లుబాటు అయ్యేది. డైరెక్టర్స్‌కి ఆ స్థాయిలో గౌరవం ఉండేది అని మనవాళ్ళు గతమెంతో ఘనం అని మాటలు చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుతానికి వస్తే మాత్రం అంతా రివర్స్. టాప్ రేంజ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా హీరోల చుట్టూ…..వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితి.

సింహా సినిమాతో సహా చాలా హిట్స్ ఇచ్చిన బోయపాటి అల్లు అర్జున్ చుట్టూ సంవత్సరం తిరిగాడు. మెగా కాంపౌండ్‌లోని కుక్కలకు తప్ప అందరికీ కథ చెప్పాను అని బోయపాటి ఆవేదన వెళ్ళగక్కేవాడని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇతర డైరెక్టర్స్ అందరిదీ కూడా అదే పరిస్థితి. కానీ ఒక్క రాజమౌళి మాత్రం ప్రత్యేకం. ఇప్పటి వరకూ ఎన్టీఆర్, చరణ్‌లకు కథ కూడా చెప్పలేదు రాజమౌళి. రామ్ చరణ్ ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు. కథ రాజమౌళి బుర్రలోనే ఉందని……. మాకెవరికీ చెప్పలేదని చెప్పాడు. తను మంచి కథే చేసి ఉంటాడు కదా అన్న నమ్మకంతో ఒకే చేశానని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్‌కి కూడా కథ చెప్పలేదు రాజమౌళి. నిజానికి ఈ ఇద్దరు హీరోలకంటే ఇప్పుడు రాజమౌళి ఇమేజ్, మార్కెట్ పెద్దది. అందుకే రాజమౌళికి అలాంటి అవకాశం దొరికింది. ప్రతిభతో కూడా అలాంటి స్థాయి తెచ్చుకున్న డైరెక్టర్ ఇంకొకరు ఉన్నారు. నాన్నకు ప్రేమతో లాంటి క్లాసిక్ హిట్ సిినిమా తర్వాత సుకుమార్‌కి ఒక మాట ఇచ్చాడు ఎన్టీఆర్. మళ్ళీ తనతో సినిమా చేయాలి అని అనుకుంటే కథ కాదు కదా…….ఒక్క సీన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్ఫాం చేస్తే చాలు…….డైరెక్ట్‌గా సెట్స్‌కి వచ్చేస్తా అని సుకుమార్‌తో చెప్పాడు ఎన్టీఆర్. ముందు ముందు ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా చాలా మంది రావాలని మనమూ కోరుకుందాం. అప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మరిన్ని ఎక్కువ సంఖ్యలో క్వాలిటీ సినిమాలు వస్తాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -