Wednesday, May 15, 2024
- Advertisement -

అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన ప్ర‌ధాన పార్టీలు..

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బహుశా గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండకపోవచ్చు. ఆయన్ను ఏకంగా పలు ప్రధాన పార్టీలు ఇంచుమించు ‘బహిష్కరించినంత పనిచేశాయి. నాలుగు సంవ‌త్స‌రాలుగా భాజాపాతో అంట‌కాగి… ఏనాడు అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌ని బాబు హ‌టాత్తుగా ఇప్పుడు అఖిల ప‌క్షాన్ని ఏర్పాటు చేశారు. ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశానికి కాంగ్రెస్ త‌ప్ప మిగితా ప్ర‌ధాన పార్టీల‌న్నీ బ‌హిస్క‌రించాయి.

ప్రధాన విపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు, నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ఇప్పుడు విడిపోయిన బీజేపీ, కొత్తగా మొదలైన జనసేన, ఆ పార్టీతో జట్టుకట్టిన వామపక్షాలు చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే ఈ పార్టీలన్నీ తమ తమ అభిప్రాయాలను ప్రకటనల రూపంలో మీడియాకు అందించాయి. తెలుగుదేశం ఆహ్వానాన్ని మన్నించిన ఒకే ఒక్క పార్టీగా కాంగ్రెస్ నిలవడం గమనార్హం. మరికాసేపట్లో ఈ సమావేశం జరుగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -