Monday, April 29, 2024
- Advertisement -

బిజెపితో వైకాపా పొత్తు……. విషయం తేల్చేసిన జగన్… వైకాపా శ్రేణులు హ్యాపీ

- Advertisement -

నాలుగేళ్ళుగా బిజెపితో రాసుకుపూసుకు తిరిగిన చంద్రబాబుకు ఇప్పుడు బిజెపి అసహ్యంగా కనిపిస్తోంది. విభజన నాడు బిజెపిది కూడా సమాన పాపం అన్న విషయం కూడా ఇప్పుడు బాబుకు సడన్‌గా తెలిసొస్తోంది. ఎట్‌లీస్ట్…….ఇప్పుడే జ్ఙానోదయమైంది అన్నట్టుగా అమాయకంగా మాట్లాడేస్తున్నాడు చంద్రబాబు. అలా అని జనాలను నమ్మించాలని చూస్తున్నాడు. తాను పునీతుడిని అని చెప్పుకోవడంతో పాటు జగన్ పాపి అని చెప్పడం కూడా చంద్రబాబు స్టైల్.

అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ద్వేషిస్తున్న బిజెపితో జగన్ జత కడతాడు…..2019 ఎన్నికల్లో బిజెపి-వైకాపాలు కలిసి పోటీచేస్తాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. ఇక సుజనా చౌదరి సొంత ఛానల్ మహా టీవీలోనూ, ఆ తర్వాత మరో పచ్చ బ్యాచ్ ఛానల్ టివి9 సహకారంతో బాబు భజన బ్యాచ్‌లో పరోక్ష సభ్యుడు అయిన హీరో శివాజీ చేత వినిపించన గరుడ పురాణం అయితే ఆంధ్రప్రదేశ్ జనాలకు కామెడీ అయిటంగా పనికొచ్చింది. 2019ఎన్నికల్లో బిజెపికి మద్దతిస్తాడు……ఆ తర్వాత బిజెపి జగన్‌ని జైలుకు పంపిస్తుంది అన్నది శివాజీ డైలాగ్. ఇచ్చిన మాట కోసం సోనియాను వీడి వచ్చినప్పుడు కూడా ‘తనపైన కేసులు పెడతారు, హింసిస్తారు’ అని స్పష్టంగా చెప్పిన జగన్‌కి ఆ మాత్రం తెలియదా? అంత అమాయకంగా తన పార్టీని, రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేసుకోవాల్సిన అవసరం జగన్‌కి ఏంటి? అయినా ఆ కేసుల్లో అస్సలు పస లేదన్నది నిజం. అదే ఉంటే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ పాటికి ఎప్పుడో తన అండర్‌లో ఉండే రాష్ట్ర పోలీసు విభాగం చేత అయినా సరే కనీసం జగన్‌ని ఇబ్బందిపెట్టే ఏదో ఒక నిర్ణయం కచ్చితంగా తీసుకుని ఉండేవాడు. జగన్‌ని అణగదొక్కడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్న చంద్రబాబు అలాంటి బంపర్ ఛాన్స్ వదులుకుంటాడా?

ఆ విషయాలు పక్కనపెడితే బిజెపితో పొత్తు విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది వైసీపీ. ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేత తన పార్టీ అభిప్రాయాన్ని చెప్పించాడు జగన్. ఎట్టి పరిస్థితిల్లోనూ 2019లో వైకాపా బిజెపితో పొత్తు పెట్టుకోదు. వేరే ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదు. కమ్యూనిస్టులు కనుకు వైకాపా కండిషన్స్‌కి ఒప్పుకుంటే వాళ్ళతో పొత్తు ఉంటుంది అన్నది వైకాపా మాట. తెరవెనుక, తెర ముందు………లోపాయికారిగా గానీ, బహిరంగంగా కానీ బిజెపితో మాత్రం వైకాపాకు ఎలాంటి సంబంధాలు ఉండవనీ చెప్పుకొచ్చాడు మేకపాటి. మొత్తానికి వైఎస్ జగన్ బిజెపితో కలిసిపోతున్నాడు అని అసత్య ఆరోపణలు చేస్తూ జనాలను నమ్మించాలన్ని చూస్తున్న చంద్రబాబు, ఆయన భజన మీడియా ప్రయత్నాలకు వైకాపాలోనే సీనియర్ మోస్ట్ ఎంపి అయిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాటలతో చెక్ చెప్పించాడు జగన్. బిజెపితో పొత్తు పెట్టుకోం అన్న జగన్ స్పందనను మాత్రం వైకాపా శ్రేణులు హృదయపూర్వకంగా ఆహ్వానించడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -