Thursday, March 28, 2024
- Advertisement -

స‌మంత వెబ్ సిరీస్ మ‌ళ్లీ వాయిదా

- Advertisement -

వెండితెర‌పై ఏం మాయ చేసావే..! అంటూ కుంద‌న‌పు బొమ్మ‌గా మెరిసి యువ‌త‌లో య‌మ క్రేజ్ సంపాదించుకున్న న‌టి స‌మంత‌. ఈ సినిమా త‌ర్వ‌త అటు యుత్‌ఫుల్ సినిమాల‌తో పాటు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ.. ద‌క్షిణాదిన అగ్ర‌క‌థానాయిక‌గా ఎదిగింది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైత‌న్య‌ను ల‌వ్ మ్యారేజ్ చేసుకుని అక్కినేని కోడ‌లుగా వెండితెరపైనే కాకుండా ప‌లు షోల‌తో బుల్లితెర‌పై కూడా అద‌ర‌గొడుతోంది స‌మంత‌.

అయితే, సమంత సినిమాలు, బుల్లితెర షోల‌తో పాటు వెబ్‌సిరీస్‌ల‌లో కూడా న‌టిస్తోంది. ఆమె న‌టించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ కోసం ఆమె అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ది ఫ్యామిలీ మ్యాన్‌-2ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా ఈనెల 12న (ఫిబ్ర‌వ‌రి 12) విడుద‌ల చేస్తామ‌ని ఇదివ‌ర‌కు ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కులు తాజాగా వాయిదా వేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

“ఫ్యామిలీ మ్యాన్-2 కోసం అభిమానులంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని తెలుసు. మీ అంద‌రికీ సూప‌ర్ ఎక్స్ పిరియ‌న్స్ ఇవ్వ‌డానికి విడుద‌ల‌ను ఈ వేస‌వికి వాయిదా వేస్తున్నాం” అని రాజ్ అండ్ డీకేలు తెలిపారు. అయితే, వాయిదాకు గ‌ల కార‌ణాలు ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన తాండ‌వ్‌, మిర్జాపూర్ వెబ్ సిరీస్‌లు వివాదాల్లో చిక్కుకుని కొన్ని ప్రాంతాల్లో ప్రజా ఆగ్ర‌హానికి గురియ్యాయి. ఈ నేప‌థ్యంలోనే ఫ్యామిలీ మ్యాన్-2 విష‌యంలో వివాదాలు ద‌రిచేర‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకే వాయ‌దా వేసిన‌ట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -