Friday, April 19, 2024
- Advertisement -

షాక్.. పుంజుకున్న పసిడి ధర!

- Advertisement -

గత ఐదు రోజులుగా పసిడి దిగివస్తోంది. బడ్జెట్‌ ప్రతిపాదనలు, గ్లోబల్‌ మార్కెట్‌ డిమాండ్‌ తగ్గడంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి ప్రస్తుతం 43,750 ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.630 తగ్గి రూ. 47,730కి చేరుకుంది.

బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. గత కొంత కాలాంగా బంగారం ధరలు పెరుతుతూ.. తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే బడ్జెట్ సమావేశం తర్వాత బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరుగుతున్నాయి. నిన్నటి వరకు తగ్గిన ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి.

అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.44,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48, 060 కి చేరింది.  అయితే, బంగారం ధర తరహాలోనే వెండి ధర కూడా భారీగానే పెరిగింది.  కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 73,400కి చేరింది.  

స‌మంత వెబ్ సిరీస్ మ‌ళ్లీ వాయిదా

సీరియల్ నటుడు శ్రీవాత్సవ్ ఆత్మహత్య..!

అల్లు అర్జున్‌కు కారావాన్ కి ప్రమాదం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -