Saturday, May 4, 2024
- Advertisement -

ది గోట్ లైప్..150 కోట్ల క్లబ్‌లో!

- Advertisement -

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ది గోట్ లైఫ్. పాన్ ఇండియా లెవల్లో మార్చి 28న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. విడుదలైన 25 రోజుల్లో రూ.150 కోట్ల వసూళ్లను రాబట్టింది ఈచిత్రం.

తొలి షో నుండే పాజిటివ్ టాక్‌ రాబట్టగా అమలా పాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ రిలీజ్ చేసింది. జిమ్మీ జీన్ – లూయిస్, రిక్ అబీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి కథే ది గోట్ లైఫ్. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోయి..రెండేళ్లు ఏడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. తినేందుకు సరైన ఆహారం దొరక్క విపరీతమైన ఎడారి వాతావరణంలో నజీబ్ ఎదుర్కొనే కష్టాలు సహజ సిద్ధంగా చూపించారు దర్శకుడు. నజీబ్ సాగించిన ఈ సాహసోపేత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తికరంగా నిలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -