Tuesday, May 21, 2024
- Advertisement -

వైర‌ల్ అవుతున్న ‘ద లయన్ కింగ్’ ట్రైల‌ర్‌

- Advertisement -

దాదాపు పాతికేళ్ల క్రితం విడుదలై విజయం సాధించిన ‘ద లయన్ కింగ్’ యానిమేషన్ ఫిల్మ్ చిత్రం ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో తిరిగి తయారై 3డీ యానిమేషన్లో అదే పేరుతో విడుదలకు సిద్ధం అవుతుండగా, దీని టీజర్ విడుదలై వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ తో డిస్నీ నిర్మిస్తున్న చిత్రానికి ‘ది జంగిల్ బుక్’ దర్శకుడు జోన్ ఫావ్రే దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డొనాల్డ్ గ్లోవర్, సేత్ రోజెన్, చివిటెల్ ఇజియోఫర్, బిల్లీ ఐచనర్, జాన్ ఓలివర్ తదితరులు వివిధ జంతు పాత్రలకు డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవి కానుకగా, జూలై 19న విడుదల కానుంది. మ‌రి మొద‌టి భాగం విజ‌యం సాధించిన‌ట్లుగా రెండో భాగం కూడా విజ‌యం సాధిస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -