Monday, April 29, 2024
- Advertisement -

కేసీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌..

- Advertisement -

తెలంగాణా ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ వ్యగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ రాజ‌కీయాల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించార‌ని ఎద్దేవ చేశారు. ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న ఫామ్‌హౌస్‌కే ప‌రిమిత‌మ‌ని చ‌లోక్తులు విసిరారు. సంద‌ర్భంగా సీఎంకు శుభాకాంక్ష‌లు తెలిపారు ఉత్త‌మ్‌.

ఎన్నికల్లో ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని, ఇక్కడ తనకేమీ ఇబ్బంది ఉండదని, ప్రజలే నష్టపోతారని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందించారు. ముస్లింలు, గిరిజనులు, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగున్నాయని చెప్పారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మహాకూటమే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ నియంతృత్వ పాలనతో ప్రజలు, నాయకులు విసిగిపోయారని, కేసీఆర్‌ పాలన నుంచి విముక్తి కలిగే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై ప్రజల్లో ఉన్న ముసుగు తొలిగిపోయిందని, దోచుకోవడానికే అధికారాన్ని కోరుకుంటున్నారని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలు దృష్టి మరల్చడానికే కేసీఆర్ కూటమిపై విమర్శలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -