Sunday, May 19, 2024
- Advertisement -

ఒక్క వీడియోతోనే 100 కోట్ల సంపాద‌న‌

- Advertisement -

బాహుబ‌లి ఒక్క సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది.ఈ సినిమాతో ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు.ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో మొట్ట మొద‌టి 2000 కోట్లు సందించిన హీరోగా రికార్డు సృష్టించాడు ప్ర‌భాస్‌.ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జ‌రుపుకుంటుంది.ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజిత్‌.ప్ర‌భాస్ పుట్టిన రోజున విడుద‌ల చేసిన సాహో మేకింగ్ వీడియోకు విప‌రీత‌మైన రెస్ప‌న్స్ వ‌చ్చింది. ప్రభాస్ జాకెట్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయడం చాలా స్టైలిష్ గా అనిపించింది. హాలీవుడ్ రేంజ్ లో ఉందని ఆయన అభిమానులు మురిసిపోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది.ఈ ఒక్క వీడియోతో 100 కోట్లు సంపాదించే ప‌నిలో ప‌డ్డాడు ప్ర‌భాస్‌.

ఈ వీడియో చూసిన ప్రముఖ బైక్ కంపనీ బ్రాండ్ ఎండార్స్ మెంట్ కోసం ప్రభాస్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. డీల్ కుదుర్చుకోవడానికి భారీ మొత్తంలో ప్రభాస్ కి ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ కూడా ఈ డీల్ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాడని త్వరలోనే ఫైనల్ చేస్తాడని టాక్. ఈ బైక్ కంపనీ మాత్రమే కాకుండా ఇతర కార్పోరేట్ కంపనీలు కూడా తమ బ్రాండ్ ని ప్రమోట్ చేయమని ప్రభాస్ వెంట పడుతున్నాయి. మ‌రి వీటిని ప్ర‌భాస్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.సాహో సినిమా క‌నుక హిట్ అయితే ప్ర‌భాస్ రేంజ్ మ‌రింత పెరుగుతుందన‌డంలో ఎటువంటి సందేహం లేదు.ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -