- Advertisement -

ఆ సినిమా వసూళ్లు బాహుబలికి ముప్పై రెట్లు..!

- Advertisement -

మనోళ్లు తీసిన బాహుబలి సినిమా అన్ని భాషల వెర్షన్లతో కలుపుకొని  మూడువందల కోట్ల రూపాయలకు చేరుకొందని తెగ నీలుగుతున్నారు. హాలీవుడ్ స్థాయి సినిమా తీశామని గొప్పలు చెప్పుకొంటున్నారు.

తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ ను చేరుకొందని అంటున్నారు.

ఇక తిరుగులేదని చెప్పుకొంటున్నారు. మరి ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. నిజంగానే మనం హాలీవుడ్ కు స్థాయికి చేరుకొన్నామా? అని ఆలోచిస్తే మాత్రం మన స్థాయి ఏమిటో అర్థం అవుతుంది.

ప్రసిద్ధ హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న కలెక్షన్లను గమనిస్తే.. నిజంగా హాలీవుడ్ స్థాయి ఏమిటో అర్థం అవుతుంది. వాటితో పోల్చుకొని మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అందుకు ఒక ఉదాహరణకు జురాసిక్ వరల్డ్ సినిమాను ప్రస్తావించుకోవాలి. ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. మరీ అంత కల్ట్ హిట్ అనిపించుకోలేదు. పర్వాలేదనిపించుకొంది అంతే. మరి అలా పర్వాలేదనిపించుకొన్న సినిమా ఏకంగా 9,000 కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను సాధించినట్టుగా తెలుస్తోంది!

ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. మరి అదీ హాలీవుడ్ సినిమా స్థాయి. యావరేజ్ హిట్ అనిపించుకొన్న సినిమా తొమ్మిదివేల కోట్ల రూపాయల రేంజ్ కు చేరుకొంది. మరి మనం హాలీవుడ్ స్థాయి సినిమా అనుకొన్న బాహుబలి మూడువందల కోట్ల రూపాయలు సాధిస్తే… అసలైన హాలీవుడ్ సినిమా తొమ్మిదివేల కోట్ల రూపాయలు సాధించింది. అంటే.. ఇది బాహుబలికి ముప్పై రెట్ల ఎక్కవ స్థాయి వసూళ్లను సాధించింది.

అది కూడా ఇంకా కొన్ని దేశాల్లో విడుదల కావాల్సి ఉంది. వాటన్నింటిలోనూ విడుదల అయితే.. ఈ సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదీ హాలీవుడ్ రేంజ్. మరి మనం ఎక్కడ ఉన్నామో ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోవచ్చు కదా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -