Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ ఎంపీలపై ఇది పవన్ కల్యాణ్ ప్రభావమా..!

- Advertisement -

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలోనే ధర్నాకు దిగారు తెలుగుదేశం నేతలు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని..

రాష్ట్ర విభజనతో అన్యాయం అయిపోయిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం విషయంలో సహకరించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ధర్నాకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద..

అంతకు ముందు పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద.. వారు ధర్నాకు దిగారు.

నినాదాలు చేస్తూ…ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వారు తమ డిమాండ్లను వినిపించారు. రాష్ట్ర విభజనకు పాల్పడిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో స్పందించాలని వీరు డిమాండ్ చేశారు. ఈ ధర్నా, ఆందోళణ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అంతా పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఎంపీలు ఇలా రెచ్చిపోవడం వెనుక పవన్ కల్యాణ్ ప్రభావం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిన్నాప్పుడు. జనసేన అధినేత ప్రభావంతోనే ఈ ధర్నాలు జరిగాయేమో అని కొంతమంది గొణుక్కొంటున్నారు.

ఇటీవల ట్విటర్ లో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ ఎంపీల విషయంలో స్పందించిన సంగతి తెలిసిందే. వీరు పార్లమెంటులో ఏం చేస్తున్నారు? గోడలు చూస్తూ కూర్చొంటున్నారా? ప్రత్యేక హోదా విషయంలో పోరాడుతున్నారా? అని పవన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఎంపీల పేర్లను ప్రస్తావించి మరీ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశాడు. ఇలాంటి నేపథ్యంలో వెనువెంటనే జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో తెలుగుదేశం ఎంపీలు రచ్చ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం పవన్ కల్యాణ్ ప్రభావమేనా?! అనే సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -