Monday, May 13, 2024
- Advertisement -

జగన్ కు అక్కడ జనాలు ఏం అర్థం కావడం లేదా..!

- Advertisement -

అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్రను చేపట్టాడు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. అక్కడ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నాడు. ఇది వరకూ రెండు దశల పరామర్శ యాత్ర పూర్తి కాగా..

ఇది మూడో విడత యాత్ర. మరి ఈ సారి కూడా జగన్ కు అపూర్వ స్పందన కనిపిస్తోంది. ప్రత్యేకించి కల్యాణ దుర్గం నియోజకవర్గంలో జనాలు బీభత్సంగా వచ్చారు!

సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ..అంతకు ముందు జగన్ ఈ ప్రాంతాలకు వెళ్లినప్పుడు జనాలు ఏ స్థాయిలో వచ్చారో.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వస్తున్నారు .దీంతో… తమకు జనాల్లో మంచి పట్టు ఉందని వైకాపా వాళ్లు మురిసిపోతున్నారు. తమ అధినేత ప్రతిపక్ష పార్టీ నేతగా వచ్చినా.. జనాల్లో అదే ఆదరణ కనిపిస్తోందని వారు అంటున్నారు. అయితే ఇక్కడే వచ్చింది చిక్కంతా..! ఇప్పుడే కాదు గతంలో కూడా జగన్ సభలకు ఇలాగే వచ్చే వారు జనాలు!

 

సార్వత్రిక ఎన్నికల ముందు కూడా రాయలసీమ ప్రాంతంలో.. అనంతపురం జిల్లాలో జనహోరు ఇలాగే ఉండేది. జగన్ సభకు విపరీతంగా జనాలు వచ్చారు. అలాంటి జనహోరును చూసి వైకాపా వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. తాము గెలిచేస్తామనే భావనకు వచ్చారు. అంతా సానుకూలంగా ఉందనే అనుకొన్నారు. తీరా ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన రోజున అనంతపురం జిల్లాలోని తెలుగుదేశం నేతలకు షాక్ తగిలింది! జిల్లాలో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకొంది! ఏకంగా 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరేసింది. ఇలాంటి నేపథ్యంలో… ఇప్పుడు కూడా భారీ స్థాయిలో జనాలు వస్తున్నా.. వైకాపా వాళ్లకు అయితే వీరి మీద గురి కుదరడం లేదు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -