Thursday, May 23, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో ఈ వారం డ‌బ‌ల్ ఎలిమినేష‌న్‌

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 2 ప్ర‌స్తుతం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. 15 వారాల బిగ్‌బాస్ షోలో ఇప్ప‌టికే ఎనిమిది వారాలు గ‌డిచిపోయాయి. మ‌రో ఏడు వారాలే ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లోనికి 17 మంది కంటెస్టెంట్‌ల‌ను పంపించ‌గా.. వారిలో ఆరుగురు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. మిగిలిన 11 మందికి తోడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. పూజా రామ‌చంద్ర‌న్ ఇప్ప‌టికే హౌస్‌లోనికి ప్ర‌వేశించ‌డంతో లోప‌లున్న వారి సంఖ్య 12కు పెరిగింది. తాజాగా బ‌య‌ట‌కు వెళ్లిపోయిన ఆరుగురిలో ఇద్ద‌రిని మ‌ళ్లీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా మ‌ళ్లీ హౌస్‌లోనికి పంపిస్తున్నారు. ప్రేక్ష‌కుల ఓట్ల‌తో రీఎంట్రీకి శ్యామ‌ల‌, నూత‌న్ నాయుడు ఎంపిక‌య్యారు. ఈ రోజు లేదంటే రేపు రాత్రి వీరు హౌస్‌లోనికి వెళ్ల‌నున్నారు. వీరిద్ద‌రితో క‌లిపితే.. హౌస్‌లోని వారి సంఖ్య 14కు పెరుగుతుంది. బిగ్‌బాస్‌లో ఇంకా మిగిలింది.. ఏడు వారాలే. ఈ ఏడు వారాల్లో 14 మందిని బ‌య‌ట‌కు పంపించాల్సి ఉంటుంది. అంటే.. వారానికి ఇద్ద‌రు చొప్పున నాలుగు వారాలు డ‌బ‌ల్ ఎలిమినేష‌న్ చేయాల్సి ఉంటుంది.

బిగ్‌బాస్‌లో ఈ వారం మొద‌టి డ‌బ‌ల్ ఎలిమినేష‌న్ ఉండ‌బోతోంది. ఈ వారం నామినేష‌న్ల‌లో కౌశ‌ల్‌, బాబూ గోగినేని, గ‌ణేష్, నందిని, దీప్తి క‌లిసి ఐదుగురున్నారు. వీరిలో ఇద్ద‌రు డ‌బ‌ల్ ఎలిమినేష‌న్ ప‌ద్ధ‌తిలో బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నారు. నామినేష‌న్ జాబితాలో ఉన్న కౌశ‌ల్ ఎలాగూ ఫైన‌ల్ వ‌ర‌కూ ఉంటాడు. అత‌నికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బ‌ట్టి.. అత‌ను వెళ్లే ప్ర‌స‌క్తే లేదు. కౌశ‌ల్ ఆర్మీనే కాకుండా.. ప్ర‌తి ఇంటిలోనూ కౌశ‌ల్‌కు అభిమానులున్నారు. ఈ వారం వ‌చ్చే ఓట్ల‌లో 80శాతం కౌశ‌ల్‌కే ఉండ‌బోతున్నాయ‌ని.. ఇప్ప‌టికే అనేక ఆన‌లైన్ స‌ర్వేలు వెళ్ల‌డిస్తున్నాయి. మిగ‌తా 20శాతం ఓట్ల‌లో ఈ న‌లుగురిలో ఎవ‌రికి ఎక్కువ వ‌స్తే.. వాళ్లు ఉంటారు. ప్ర‌స్తుతం ఈ న‌లుగురిలో బాబూ గోగినేని, దీప్తి న‌ల్ల‌మోతు.. కంటే.. గ‌ణేశ్‌, నందిని.. వెనుకంజ‌లో ఉన్నారు. ఈ వారం డ‌బ‌ల్ ఎలిమినేష‌న్‌లో వీరిద్ద‌రే వెళ్లిపోనున్నారు. బాబూ గోగినేనికి కొంతమంది అభిమానులు వ్య‌క్తిగ‌తంగా ఉన్నారు. దీప్తి న‌ల్ల‌మోతు కూడా.. మిగ‌తా ఇద్ద‌రితో పోలిస్తే.. బిగ్‌బాస్ హౌస్‌లో యాక్టివ్‌గానే ఉంటోంది. అయితే.. బాబూ గోగినేనికి సంబంధించిన కేసుల విష‌యంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు ఎదురైతే.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చేసే అవ‌కాశం ఉంది. కోర్టు ఆదేశాల మేర‌కు.. పోలీసులు కూడా కేసులు న‌మోదు చేసి.. అరెస్ట్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. బిగ్‌బాస్ నిర్వాహ‌కులను పోలీసులు సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. ఒక‌వేళ బాబు గోగినేని చుట్టూ ఈ కేసుల గోల చుట్టుకుంటే.. ఇంక హౌస్‌లో ఉంచి తాము ఎందుకు త‌ల‌నొప్పులు ప‌డాల‌నే ఉద్దేశంతో ఆయ‌న‌ను బ‌య‌ట‌కు పంపించే అవ‌కాశం ఉంది. అలాగైతే.. నందిని, గ‌ణేష్‌ల‌లో ఒక‌రు ఈ వారం ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే.. ఖ‌చ్చితంగా ఈ వారం ఎలిమినేష‌న్ అయ్యేది వీరిద్ద‌రే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -