Friday, April 26, 2024
- Advertisement -

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే…!

- Advertisement -

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా థియేటర్లు అన్ని మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాణం పూర్తయిన సినిమాలకు ఓటీటీ వేదికగా మారాయి. ముందు నెట్ ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీలు ఉండగా ఇప్పుడు థియేటర్లు మూత కారణంగా ఓటీటీ వేదికల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఆహా, సన్ డైరెక్ట్, జీ 5, ఏఎల్ టీ, సోనీ లైవ్ , ఎమ్ ఎక్స్ ప్లేయర్, స్పార్క్ వంటి వేదికల్లో రోజు కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి.

ఓటీటీ వేదికల్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరగడంతో, సంస్థలు కూడా రీజనబుల్ మనీ పే చేసి నిర్మాతల దగ్గర నుంచి సినిమాలను కొంటున్నాయి. అలాగే ఓటీటీ సంస్థలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, ప్రత్యేక షోలను కూడా ప్రసారం చేస్తున్నాయి. కాగా ఈ వారం ఓటీటీ వేదికల్లో పెద్ద సంఖ్యలో కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి.

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు ఇవే ఇవాళ నెట్ ఫ్లిక్స్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన జగమే తంతిరం ఏకంగా 17 భాషల్లో, వందల దేశాల్లో విడుదల అయింది. అలాగే ఈ వారంలో క్వాబోంకే పరిందే (ఊట్ ), మనిషి (స్పార్క్ ), ఏ ఫ్యామిలీ, బ్లాక్ సమ్మర్ సీజన్ 2, ది రేషనల్ లైఫ్, ఏ లైట్ సీజన్ 4(నెట్ ఫ్లిక్స్ ) ఫిజికల్ (యాపిల్ టీవీ ప్లస్ ), ది అడ్వెంచర్స్ ఆఫ్ ఊల్ఫ్ బాయ్, అఫీషియల్ సీక్రెట్స్ ( బుక్ మై షో స్ట్రీమ్ ), ఇన్ ది హైట్స్ (హెచ్ బీవో మ్యాక్స్) కాయంకులం కొచ్చున్ని (మలయాళం), కమ్మర సంభవం(జియో సినిమా) సినిమాలు విడుదల కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -