Friday, March 29, 2024
- Advertisement -

ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

- Advertisement -

కోవిడ్ ప్రభావంతో చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు. మరికొన్ని సినిమాలు వారం, పది రోజులు షూటింగ్ చేస్తే అవి కూడా పూర్తయ్యేవి ఉన్నాయి. ఇలా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. నిర్మాతలందరూ కరోనా ప్రభావం పూర్తిగా ఎప్పుడు తగ్గిపోతుందా.. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. ఒకసారి థియేటర్లు ఓపెన్ చేశారంటే ఇక వరుసగా సినిమాలు థియేటర్లలోకి క్యూ కట్టనున్నాయి. సినిమాలు చాలా సంఖ్యలో షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే గందరగోళం ఎక్కువైంది.

సినిమాలు ఒకప్పటిలా 50 డేస్, 100 డేస్ ఆడడం లేదు. ఇందుకు పైరసీనే కారణం. అందువల్లే నిర్మాతలు తమ సినిమాలను వందలకొద్దీ థియేటర్లలో విడుదల చేసి తొలి రెండు వారాల్లోనే తమ పెట్టుబడి, లాభాలను వెనకేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూలై మొదటి వారం లేదా రెండో వారంలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా ఏ సినిమాలు థియేటర్లలో విడుదల అవుతాయో క్లారిటీ లేదు. జూలై మధ్యలో థియేటర్లు ఓపెన్ కాగానే చాలా సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

అలాగే దసరా పండుగకు, సంక్రాంతి పండుగకు పెద్ద సంఖ్యలో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందులో అగ్ర హీరోలు నటించిన సినిమాలే ఎక్కువ. ప్రతి అగ్ర హీరో తమ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ముందే అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పుడు అదే డేట్ కి థియేటర్లలో విడుదల అవ్వడం సందేహంగా మారింది. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అవగానే లవ్ స్టోరీ, ఖిలాడి, నారప్ప, విరాట పర్వం, టక్ జగదీష్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే 50 శాతం ఆక్యు పెన్సీ తో సినిమా థియేటర్లు ప్రారంభమైతే ఇందులో కొన్ని సినిమాలు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయాలని భావించారు. చిరంజీవి ఆచార్య సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే పుష్ప ఇప్పుడు ముందు ప్రకటించిన డేట్ కు విడుదల అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఇది కూడా దసరాకు పోస్ట్ పోన్ అవకాశం కనిపిస్తోంది. దీంతో మెగా హీరోల రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడుతుంది.

Also Read:నెటిజన్ల రేటింగ్స్​.. మాస్టర్​ టాప్.. వకీల్ సాబ్​, క్రాక్ జోరు

ఒకవేళ ఆచార్యను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేద్దామని భావించిన సంక్రాంతి రేసులో పవన్ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కు పోటీగా విడుదల చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు తలనొప్పిగా మారింది. అలాగే దసరా రేసులో ప్రభాస్ రాధేశ్యామ్ ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మరో భారీ సినిమా పుష్ప కూడా విడుదల అయితే రాధేశ్యామ్ కలెక్షన్లపై దెబ్బ పడే అవకాశం ఉంది. రాధే శ్యామ్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో సింగిల్ గా థియేటర్ల లోకి వస్తేనే ప్రయోజనం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
అలాంటిది ఇప్పుడు టఫ్ ఫైట్ గా మారింది.

సంక్రాంతి రేస్ కూడా ఇలాగే ఉంది. సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట, పవన్ సినిమా బరిలో ఉండగా ఇప్పుడు ఆచార్య కూడా సంక్రాంతికి వాయిదా పడితే పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నగా మారింది. అలాగే అక్టోబర్ 13న విడుదల కావాల్సిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతి రేసులోకి వస్తున్నట్లు తెలిసింది. ముందుగా ఈ సినిమాను దసరా నుంచి పోస్ట్ పోన్ చేసి సమ్మర్ సీజన్లో విడుదల చేయాలని భావించారు. అయితే సమ్మర్ సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటే కరోనా థర్డ్ వేవ్ ఆటంకంగా మారింది. ఆ సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటే మళ్లీ కొన్ని నెలలపాటు ఆ సినిమాను విడుదల వాయిదా వేయాల్సి ఉంటుంది.

Also Read: లైట్స్.. కెమెరా.. యాక్షన్..!

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పలుమార్లు షూటింగ్ వాయిదా పడి ఎనలేని జాప్యం నెలకొంది. ఇప్పుడు విడుదలలో కూడా జాప్యం ఏర్పడితే నిర్మాత మరీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ సినిమాను జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందువల్లే ఆ సినిమాను జనవరి 26 వ తేదీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే చిరంజీవి, మహేష్, పవన్ సినిమాల కలెక్షన్ల పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కూడా ఈ ఏడాది చివరికల్లా రెడీ అవుతుందని టాక్. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా గందరగోళంగానే మారింది. నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య తో పాటు మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అడవి శేష్ మేజర్, అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. వరుణ్, వెంకీ ఎఫ్ 3, వరుణ్ గని, విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ జరుగుతుండగా, సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్, క్రిష్ -వైష్ణవ్ తేజ్ సినిమా, నితిన్ మ్యాస్ట్రో షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్​ ఫార్ములా?

ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుండగా థియేటర్లలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. దీంతో ఎప్పుడు ఏ సినిమాను విడుదల చేయాలో, ఏ సినిమాకు మరో సినిమా పోటీగా వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -