ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ టీజర్

- Advertisement -

ఈ మద్య టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోల హవా బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో శ్రీవిష్ణు ఒకరు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు తర్వాత హీరోగా మారారు. తాజాగా శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో మేఘ ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. హీరో ఓ మురికివాడలో నివాసం ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చాలా స్టైల్ గా తయారైపోయి, తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అని చెప్పుకుంటూ ఉంటాడు.

ఆ అబద్ధం చెప్పే హీరోయిన్ కి దగ్గరవుతాడు అనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాలో రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఒక కేస్ క్లోజ్ చేయడానికిగాను ఒక అమాయకుడైన యువకుడి కోసం వెదుకుతున్న ఆయనకి హీరో తారసపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా కీర్తి చౌదరి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రావ‌ణాసురుడు వ‌చ్చెనే అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో సౌండ్ వ‌స్తుండ‌గా, శ్రీ విష్ణు వెరైటీ గెట‌ప్స్‌లో క‌నిపించడం విశేషం. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్,శ్రీకాంత్‌ అయ్యంగార్, అజయ్‌ ఘోష్, వాసు, గంగ‌వ్వ‌, ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -