Sunday, April 28, 2024
- Advertisement -

ఆగని టైగర్ సునామీ..ట్రెండింగ్‌లో తేజ!

- Advertisement -

వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటించగా అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది ఈ చిత్రం. రవితేజ కెరీర్‌లో ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కాగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాచాటింది. తొలి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

ఇక ఓటీటీలో కూడా సత్తా చాటుతోంది టైగర్ నాగేశ్వరరావు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ x ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. Tiger Nageshwarrao హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించగా…. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

ప్రస్తుతం ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండగా హిందీ వెర్షన్‌కి సంబంధించి అప్‌డేట్ రాలేదు. ఏదిఏమైనా థియేటర్లలో ఈ సినిమా మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -