Monday, May 13, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రింత బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి…కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ మందా జగన్నాథం సైతం హస్తం గూటికి చేరిపోయారు. వీరిద్దరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఖర్గే. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు విజయశాంతి.

2009లో బీఆర్ఎస్ నుండి మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. 2009లో బీఆర్ఎస్‌కు ఇద్దరు ఎంపీలు ఉంటే ఒకరు కేసీఆర్ అయితే మరొకరు విజయశాంతి. అంతకంటే ముందు తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం దానిని బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. అయితే తదనంతరం కేసీఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగా బీఆర్ఎస్‌ను వీడారు.

ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మందా జగన్నాథం. సీనియర్ పార్లమెంటేరియన్. 1996,1999,2004,2009లో నాగర్ కర్నూల్ ఎంపీగా గెలుపొందారు. ప్రజల వాయిస్‌ని బలంగా వినిపించగల నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ వచ్చాక ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. తాజాగా ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి సొంతగూటికి చేరిపోయారు. ఇక ఇప్పటికే చేరికలతో జోష్ మీదున్న కాంగ్రెస్‌కు ఇద్దరు సీనియర్ లీడర్లు రావడం మరింత బలాన్నిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -