Tuesday, May 14, 2024
- Advertisement -

ఎవరు గెలుస్తారు..ఏపీలో బెట్టింగ్‌ల జోరు?

- Advertisement -

ఒకప్పుడు బెట్టింగ్ అంటే క్రికెట్ గుర్తుకొచ్చేది…కానీ ఇప్పుడు అది రాజకీయ పార్టీలకు పాకింది. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఎవరు గెలుస్తారు…? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న దానిపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. తాజాగా ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న వేళ ఏపీలో బెట్టింగ్‌ జోరందుకుంది. బెట్టింగ్ రాయుళ్లు ఎవరు విన్ అవుతారన్న దానిపై ఎంతైనా బెట్ ఖాయడానికి వెనుకాడటం లేదు.

ప్రధానంగా హాట్ అసెంబ్లీ స్థానాలు, కీలక లీడర్లు పోటీ చేసే చోట ధర కాస్త ఎక్కువే పలుకుతోన్నట్లు తెలుస్తోంది. ఇక హాట్ స్థానాల విషయానికొస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూకట్ పల్లి, ఎల్బీ నగర్,శేరిలింగంపల్లి,మల్కాజ్‌గిరి,జూబ్లీహిల్స్ వంటి స్థానాలున్నాయి. ఇందులో ప్రధానంగా మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హనుమంతరావు పోటీ చేస్తుండగా ఆయనపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో మైనంపల్లిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది బీఆర్ఎస్. అందుకే ఈ స్థానంలో బెట్టింగ్ కాస్త ఎక్కువగా జరుగుతోంది.

దీంతో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక్కడ బీజేపీ తరపున ఈటల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో ఉండటంతో అందరి దృష్టి ఈ స్థానాలపైనే ఉన్నాయి. అలాగే హరీశ్ రావు, కేటీఆర్ మెజార్టీలపై కూడా బెట్టింగ్ జోరందుకున్నట్లు తెలుస్తోంది. ముంబై,ఢిల్లీకి చెందిన బెట్టింగ్ ముఠాలు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్ లక్షల్లో కాదు కోట్లల్లో నడుస్తున్నట్లు తెలుస్తోండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -