Sunday, May 5, 2024
- Advertisement -

టిక్ టిక్ టిక్ ట్రైల‌ర్ చూశారా?

- Advertisement -

తమిళ సినిమాలు తెలుగులో మంచిగా ఆడుతాయి. తెలుగు ప్ర‌జ‌లు బాగుంటే భాష‌బేధం లేకుండా అన్నీ సినిమాల‌ను ఆద‌రిస్తారు. ఇక తెలుగు, త‌మిళం అంటే జంట‌గా భావించాలి. ఇప్పుడు ఈ కోవ‌లో ఓ సినిమా కోలీవుడ్‌లో రూపుదిద్దుకుంటోంది. కొత్త కొత్త జానర్లను కొత్త కొత్త పంథాలో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ వెళ్తోంది. ఇప్పుడు స‌రికొత్త క‌థాంశంతో ‘టిక్ టిక్ టిక్’ సినిమా వ‌స్తోంది. అంత‌రిక్షం నేప‌థ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌యం ర‌వి ముఖ్య‌పాత్ర‌లో టిక్ టిక్ టిక్ సినిమా వ‌స్తోంది. థ్రిల్లర్‌ను తలపించే స్ర్కీన్ ప్లే.. హాలీవుడ్ తరహా విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఆకాశంలో నుంచి ఒక ఉల్క భూగోళాన్ని తాకుతుంది. ఇక మరో 60 రోజుల్లో అంతకంటే పెద్దదైన ఉల్క పడి.. భూమ్మీద ఒక సిటీ లేకుండా మాయమైపోతుంది అని చెబుతూ ఆ ఉల్క బారి నుంచి భూమిని ఎలా ర‌క్షించారు అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఉండ‌నుంది అని ట్రైల‌ర్‌ను చూస్తుంటే తెలుస్తోంది.

అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ఉల్క మీదకు మనమే ఒక స్పేస్ షెటిల్ పంపేసి దానిని బ్లాస్ట్ చేయాలి. సరిగ్గా ఇదే మన చినప్పుడు 90లలో వచ్చిన ‘ఆర్మగెడాన్’ సినిమా కథ. ఇప్పుడు అదే కథను తీసుకుని.. పైన స్పేస్ లోకి వెళ్ళి ఆ ఉల్కను బ్లాస్ట్ చేయాలంటే ఒక మిస్సైల్ కావాలి కాబట్టి.. దానిని ఒక చైనా స్టేషన్ నుండి దొబ్బేయడానికి ఒక మెజీషియన్ (జయం రవి)ను పంపిస్తారు. అతనితోపాటు ఇతర ఆస్ర్టోనాట్స్ (వోమగాములు) కూడా వెళతారు. అక్కడ వారేం చేస్తారు అనేదే కథ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -