Sunday, May 19, 2024
- Advertisement -

‘విజేత’ను అంటున్న చిరు చిన్న‌ల్లుడు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి మ‌రో హీరో వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.ఆ హీరోనే చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌.చిరంజీవి రెండువ కుమార్తె శ్రీజ‌ను రెండో వివాహం చేసుకున్నాడు క‌ల్యాణ్‌.ఇత‌ను ఇప్పుడు హీరోగా ప‌రిచియ‌మ‌వుతున్నాడు.ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా క‌ల్యాణ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి సినీ కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ లాంటి సినిమా విజేత టైటిల్‌నే త‌న మొద‌టి సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారు చిత్ర బృందం.

టైటిల్‌ లోగోను రివీల్‌ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌ కూడా ఆసక్తికరంగా ఉంది.ఓ చిన్నారి చేతిని పట్టుకున్న హీరో చేతిని ఈ పోస్టర్‌లో చూపించారు. పోస్టర్‌పై రాసి ఉన్న దాన్ని చూస్తే సినిమా లైన్‌ ఏంటో అర్థమవుతుంది. పక్క వారి మొహంలో సంతోషం నింపడం కూడా మనం సాధించే విజయమే అంటూ పోస్టర్‌పై ఉంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవికా నాయర్‌ నటిస్తోంది.రాకేశ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -