Saturday, April 20, 2024
- Advertisement -

సినిమాల్లోకి రాక‌ముందు ఈ కామెడీ విల‌న్ ఏంచేసే వాడో తెలుసా..?

- Advertisement -

తెలుగు సినిమాల్లో కామెడీ విల‌న్లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చాలామంది న‌టుల్ని చూస్తుంటాం. సినిమాలో హీరోను దెబ్బ‌తీయ‌డానికి విల‌న్ గ్యాంగ్ ఆటంకాలు క‌లిగిస్తుంది. ఇది కామ‌నే. కానీ గ్యాంగ్ లో కాస్త రౌడీ ఫేస్ తో కామెడీగా కనిపించే వాళ్లు వుంటారు. అలా రౌడీ గ్యాంగ్ లో కనిపిస్తూ .. తెలంగాణ యాసతో తనదైన డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు రఘు.

రౌడీయిజం నుంచి వ‌చ్చి చివ‌రికి కామెడీగా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ల‌లో ర‌ఘు ఒక‌రు. సినిమాల్లోకి రాక‌ముందు ర‌ఘు జీవితం ఏంటి…? న‌టుడు కావ‌డానికి ముందు ఏంచేసే వాడో తాజాగా స్పందించారు. పుట్టి పెరిగింది హైదరాబాద్ .. అల్వాల్. కాలేజ్ చదువు హైదరాబాద్ అంటే ఏట్లుంటది .. ఎలక్షన్లు .. పాలిటిక్స్ .. చిన్న చిన్న బస్తీ గడబిడలు ఇవన్నీ కామనే” అన్నారు.

కాలేజ్ స్టూడెంట్ గా ఉండగా బ్యాచ్ లు మెయింటెయిన్ చేస్తూనే ..చిన్న చిన్న‌గా రౌడీ యుజం చెలాయించేవాడు. అలా ఒక జోన్‌లోకి వెల్లిపోయారు. కొన్ని బ్యాంకులకు మొండి బాకీలు వసూలు చేసి పెట్టేవాడంట‌. ఇంట్లో బుద్ధుడిలెక్క ఉండేవాడిని .. బయటికి వస్తే నా చుట్టూ ఓ పదిమంది ఉండేటోళ్లు. ఆ గొడవలు .. ఈ గొడవలు .. సెటిల్మెంట్లు చేసేవాడిని గానీ .. ఏవీ ఇంటివరకూ రానిచ్చేవాడిని కాదు” అని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -