Thursday, April 25, 2024
- Advertisement -

జగన్‌ని విష్ చేయడం బాగుంది….. అలాగే బాబు అది నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది

- Advertisement -

వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా జగన్‌కి శుభాకాంక్షలు చెప్పాడు. అలాగే చంద్రబాబుకు ధన్యావాదాలు చెప్తూ జగన్ కూడా హుందాగా స్పందించాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకూ ఇది కాస్త గుర్తించదగ్గ పరిణమామే. అయితే జగన్‌ని విష్ చేయడం ద్వారా నేను జగన్‌ కంటే గొప్పోడ్ని అని నిరూపించుకోవాలన్న ఉద్ధేశ్యంతో చంద్రబాబు విష్ చేశాడా? జగన్‌కి చంద్రబాబు విషెష్ చెప్పిన వెంటనే…… కనీసం జగన్‌కి ప్రతిస్పందన తెలియచేసేంత టైం కూడా ఇవ్వకముందే టిడిపి డిజిటల్ బ్యాచ్, ఎల్లో మీడియా గ్యాంగ్ అందరూ రెచ్చిపోయారు. చంద్రబాబు సంస్కారవంతుడు, గొప్పోడు….. అందుకే శతృవైనా కూడా జగన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. కానీ జగన్ మాత్రం కనీసం తన స్పందన కూడా తెలియచేయలేదు. జగన్‌కి సంస్కారం లేదు అని విమర్శలతో రెచ్చిపోయారు. కట్ చేస్తే తన పాదయాత్ర విరామ సమయంలో చంద్రబాబు ట్వీట్‌కి జగన్ ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చాడు. ఎల్లో బ్యాచ్ అందరూ ఆ తర్వాత మళ్ళీ మాట్లాడరు. బురదచల్లడం …..తప్పు చేశామని తెలిశాక కూడా స్పందన లేకుండా ఉండడం లాంటివి జగన్ విషయంలో ఎల్లో గ్యాంగ్ ఎప్పటి నుంచో చేస్తున్నదే.

ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ చంద్రబాబు కూడా కేవలం తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి, లేకపోతే ‘చూశారా….జగన్‌కి నేను శుభాకాంక్షలు చెప్పాను’ అని నలుగురూ గొప్పగా అనుకోవడానికి మాత్రమే శుభాకాంక్షలు చెప్పలేదు అని అనుకోవాలంటే చంద్రబాబు ఇంకాస్త పెద్దరికం కూడా చూపించాలి. 2014లో కాంగ్రెస్, టిడిపి-బిజెపి-జనసేన, కమ్యూనిస్టులు, వైకాపా పార్టీలు పోటీ పడితే ఆంద్రప్రదేశ్ ప్రజలు మాత్రం టిడిపి కూటమికి అధికారాన్ని, వైకాపాకు ప్రతిపక్ష స్థానాన్ని ఇచ్చారు. అది కూడా భారీ సంఖ్యలో సీట్లు, చంద్రబాబుకంటే కేవలం ఒకటిన్నర శాతం తక్కువ ఓట్లు జగన్‌కి వచ్చాయి. అలాంటి జగన్‌ని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏ రోజూ గుర్తించలేదు. ఆ రకంగా ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నాడు చంద్రబాబు. ఇక టిడిపి భజన మీడియా కూడా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేల బలం ఉన్న, ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్ కంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు కూడా చాలా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఎంత పవన్ కళ్యాణ్ బాబు జేబులో బొమ్మ అయినా కూడా ఆయనకు జగన్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాతీర్పును చిన్నబుచ్చడమే అవుతుంది. ఇక అసెంబ్లీలోనూ, బయట కూడా టిడిపి నాయకులందరూ కూడా జగన్‌ని రాక్షసుడు, సైకో అంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. ఇక జేసీల గురించి అయితే చెప్పనవసరం లేదు. పత్రికలలో రాయలేని భాషలో చంద్రబాబు సమక్షంలోనే జగన్‌ని తిడుతూ ఉంటారు. చంద్రబాబు కాస్త హుందాతనం, పెద్దరికం చూపించి ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎలా గౌరవించాలో తెలుసుకుంటే అది ఆయనకే పేరు తెస్తుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత జగన్ కూడా చంద్రబాబు విషయంలో తాను తప్పుగా మాట్లాడిన విషయం తెలుసుకుని ఇప్పుడు హుందాగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబుతో సహా టిడిపి వాళ్ళు కూడా మారితే మాత్రం ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలోనూ, బయట కూడా కాస్త హుందాతనంతో కూడిన రాజకీయాలు చూడొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -