Friday, April 19, 2024
- Advertisement -

వినాయక్ ,శ్రీనువైట్ల ఇంటికి వెళ్ళిపోవల్సిందేనా..?

- Advertisement -

గత రెండేళ్లుగా టాలీవుడ్ కు మంచి మంచి దర్శకులే వచ్చారు. ఎవరి స్టైల్లో వారు సినిమాలను చేస్తూ మెరుపులు మెరిపిస్తున్నారు.తరుణ్ భాస్కర్ ,సందీప్ రెడ్డి, సంకల్ప్ రెడ్డితో పాటు చిన్న చిన్న దర్శకులు కూడా తమ రేంజ్ పెంచుకునే హిట్ చిత్రాలను తీసారు. వారిలో అనీల్ రావిపూడి, విరించి వర్మ, వేగేశ్న సతీష్ తో పాటు ఇంకొందరు ఇందుల్లో ఉన్నారు. వీరంతా తమ టాలెంట్ ను చూపించుకుంటూ పెద్ద సినిమాలు తీసే స్థాయి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక కొరటాల శివ, సుకుమార్ కూడా ఒకప్పటి టాప్ డైరెక్టర్లను వెనక్కి నెట్టే స్థాయికి వెళ్లిపోయారు. మరి ఈ ప్రాసెస్ లో ఇంకా టైమ్ ఉండి కూడా కొత్త తరం దర్శకుల కాన్సెప్ట్ లకు ధీటుగా స్టోరీలను తయారుచేయలేక వెనకపడిపోతున్నవారు ఎవరున్నారు.

ఇలా ప్రశ్న వేసిన వెంటనే ముందుగా గుర్తుకు వచ్చే దర్శకులు వినాయక్ , శ్రీనువైట్లలు. ఆతరువాత గుణశేఖర్ కూడా వస్తాడు. ఈ దర్శకులు ఇపుడు చాలా గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. ఏలేటి చంద్రశేఖర్ మంచి టాలెంటెడ్ అయినప్పటికీ ..కమర్శియల్ యాంగిల్ ను పట్టుకోవడానికి ఇష్టం చూపించకపోవడంతో వెనకపడిపోయాడు. బట్ ఇతగాడు మాత్రం ఓడిపోయాడని అయిపోయాడని చెప్పడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో తెలుగు సినిమాలకు సంబంధించిన గ్రూప్ లలో ఎక్కువగా మనకు వినాయక్ ,శ్రీనువైట్లల గురించే వినిపిస్తున్నాయి. దమ్ము సినిమా తరువాత బోయపాటి కోలుకోలేకపోయినట్లయితే… అతను కూడా వీరి లిస్ట్ లోకి వచ్చేసేవాడు.

కాని వినాయక్ తరహా రోమాంచిత సీన్లను తీస్తూ యాక్షన్ ప్యాక్ లతో ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నాడు.బట్ ఒకటి మాత్రం వాస్తవం కథ,కథనాల విషయంలో తమను కాకుండా టైమ్ నడుస్తోన్న రచయితల టీంను రిక్రూట్ చేసుకుంటే గాని వినాయక్ ,శ్రీనువైట్లలు పరిశ్రమలో ఉండలేరు.లేదంటే ఇంటికి వెళ్లిపోవల్సిందే.ఆవిషయం వారికి కూడా భాగా అర్ధమైందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమైపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -