Thursday, May 9, 2024
- Advertisement -

తొలి సినిమాలు హిట్లే.. ఫిబ్ర‌వ‌రి వెంకీలమయం

- Advertisement -

సంక్రాంతికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు క‌లిసి రాలేదు. సంక్రాంతికి విడుద‌లైనా సినిమాల‌న్నీ అట్ట‌ర్ ఫ్లాపు కావ‌డంతో జ‌న‌వ‌రి టాలీవుడ్‌కు క‌లిసి రాలేదు. ఇక ఫిబ్ర‌వ‌రిలో ఇండ‌స్ట్రీకి మంచి సినిమాలు వ‌చ్చాయి. రెండు సినిమాలు సూప‌ర్‌హిట్‌గా నిలిచాయి. వ‌రుణ్‌తేజ్‌, నాగ‌శౌర్య త‌మ సినిమాల‌తో ఇండ‌స్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చారు. అయితే ఈ రెండు సినిమాల‌ను తీసింది ఇద్ద‌రూ వెంకీలే. అందుకే ఫిబ్ర‌వ‌రి వెంకీల‌మ‌య‌మైంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన వెంకీ కుడుముల నాగశౌర్యతో క‌లిసి ‘ఛ‌లో’ సినిమాతో బంప‌ర్ హిట్ కొట్టేశాడు. ఫ్లాపుల‌తో బాధ‌ప‌డుతున్న శౌర్య‌కు వెంకీ మంచి విజ‌యం ఇచ్చాడు. కామెడీ.. భావోద్వేగాల‌తో తీసిన సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లై ఇంకా థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. మినిమం బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లు వ‌చ్చాయి.

న‌టుడిగా ఉన్న వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడిగా మైక్ ప‌ట్టి వ‌రుణ్‌తేజ్‌తో ‘తొలిప్రేమ’ సినిమా చేశాడు. ఫీల్‌గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా థియేట‌ర్‌ల‌లో ఆడుతోంది. కేవలం తను రాసుకున్న స్క్రిప్టును తెర‌పై చూపించి వరుణ్ తేజ్‌కు మ‌రో హిట్ ఇచ్చాడు. సెంటిమెంట్.. హృదయాల్ని బరువెక్కించే ప్రేమ‌క‌థ‌తో వెంకీ అట్లూరి సినిమా చేసి చాన్నాళ్ల‌కు టాలీవుడ్‌లో మంచి ప్రేమ క‌థా సినిమా అందించారు.

అయితే ఈ ఇద్ద‌రు వెంకీలు తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి హిట్లు పొందారు. వారి కెరీర్‌కే కాకుండా వ‌రుణ్‌తేజ్‌, నాగ‌శౌర్య కెరీర్‌ల‌కు మంచి విజ‌యాలు అందించారు. స‌మ్మ‌ర్‌కు మంచి ఓపెనింగ్స్ ఇచ్చారు ఈ యువ ద‌ర్శ‌కులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -