Monday, May 20, 2024
- Advertisement -

రూ.200 ఫైన్‌పై ట్విట్ట‌ర్‌లో స్పందించిన హీరో రామ్‌…

- Advertisement -

రామ్ పోతినేని హీరోగా చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పాతబస్తీ కుర్రాడి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ సినిమా షూటింగ్ సమయంలో పాతబస్తీలో నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్ కాలుస్తున్న రామ్ కు అధికారులు రూ.200 రూపాయలు ఫైన్ వేసిన సంగ‌తి తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసిందుకు రూ. 200 జరిమానా విధించడంతో, రామ్ చెల్లించాడు కూడా. ఈ విషయమై ఈ ఉదయం స్పందించిన రామ్, తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టాడు.

“నా టైమూ, పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే… షాట్లో కాల్చినా తమ్మీ, బ్రేక్ లా కాద్. టైటిల్ సాంగ్ లా చూస్తావుగా స్టెప్పు. ఫిర్ భీ లాకి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గుపుడు నువ్వు కూడా నా లెక్క. లైట్ తీస్కో పని చూస్కో… ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్” అని ట్వీట్ పెట్టాడు. రామ్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -