Monday, April 29, 2024
- Advertisement -

అల్లు అర్జున్‌ని కుమ్మేసిన కేర‌ళ అభిమానులు

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అంద‌రికి తెలిసిందే.ప్ర‌స్తుతం ఉన్న మెగా హీరోల‌లో అల్లు అర్జున్‌కే ఎక్కువ అభిమానులున్నారు.బ‌న్ని సినిమాలకు నెగిటివ్ టాక్ వ‌చ్చిన క‌లెక్ష‌న్లు కుమ్మేస్తున్నాయి అంటే మ‌నోడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవాలి.బ‌న్నికి తెలుగులో ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో కేర‌ళలో కూడా అంత‌టి ఫాలోయింగ్ ఉంది.కేర‌ళ‌లో అల్లు అర్జున్ సినిమాలు మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తున్నాయి.దీంతో అల్లు అర్జున్ ప్ర‌తి సినిమా కేర‌ళ‌లో కూడా విడుద‌ల అవుతుంది.ఇంత‌టి ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టే కేరళ ప్ర‌భుత్వం బ‌న్ని ఆ రాష్ట్ర‌నికి ముఖ్య అతిథిగా పిలిచింది.కేర‌ళ రాష్ట్రంలో ఎంతో ప్ర‌తీష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ప‌డ‌వ బోటు పోటీల‌కు బ‌న్నిని ముఖ్య అతిథిగా పిలిచింది కేర‌ళ ప్ర‌భుత్వం.

కేర‌ళ ప్ర‌భుత్వం ఆహ్వానం మేర‌కు బ‌న్ని అక్క‌డికి వెళ్ల‌డం జ‌రిగింది.బ‌న్ని వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న కేర‌ళ అభిమానులు ఎయిర్‌పోర్టుకు భారీగా వ‌చ్చారు. ఎంత‌లా అంటే బ‌న్నిని ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌టికి రానివ్వ‌నంతగా అభిమానులు బ‌న్ని చూట్టు గుమ్మిగుడారు.దీంతో బ‌న్ని ఎయిర్‌పోర్టులోనే చాలాసేపు వెయిట్ చేయాల్సి వ‌చ్చిందట‌.మొత్త‌నికి కేర‌ళ అభిమానులు చూపించిన ప్రేమ‌కు బ‌న్ని ఫిదా అయ్యాడ‌ని తెలుస్తుంది.ఇక బ‌న్ని త్వ‌ర‌లోనే త‌న కొత్త సినిమా విష‌యాల‌ను తెలియ‌జేస్తారని స‌మ‌చారం.బ‌న్ని కేర‌ళ భాష‌లో డైరెక్ట్‌గా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు టాక్.ఇదే క‌నుక నిజం అయితే కేర‌ళ అభిమానుల ఆనందంమ‌రింత రెట్టింపు అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -