Wednesday, May 15, 2024
- Advertisement -

జ‌గ‌న్ వాద‌న‌తో కోర్టు ఏకీభ‌వించిందా…?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌కేసు కీల‌కం కానుంది. ఘ‌ట‌న‌ను బాబు అండ్ కో చిన్న‌దిగా చూపిస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. కేసును ఆదిలోనే నీరు గార్చేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆ ప్ర‌య‌త్నాల‌కు హైకోర్టు అడ్డు క‌ట్ట వేయ‌నుందా అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

త‌న‌కు సిట్‌పై న‌మ్మ‌కం లేద‌ని ఏదైనా థ‌ర్డ్ పార్టీచేత విచార‌ణ జ‌రిపించాల‌ని జ‌గ‌న్ హైకోర్టులో రిట్ పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. పిటిష‌న్‌ను విచారించిన కోర్టు సిట్ విచారణ నివేదికను సీల్డ్ క‌వ‌ర్‌లో త‌మ‌కు అందించాల‌ని ఆదేశించ‌డం చూస్తే జ‌గ‌న్ వాద‌న‌తో ఏకీభవించినట్లే అన్న‌ది క‌న‌బ‌డుతోంది.

హత్యాయత్నం ఘటనకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం చాలా తప్పులే చేసింది. ఆ తప్పులే ఇపుడు జగన్ కు వరంలాగ మారింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. దాడి జ‌రిగిన త‌ర్వాత జ‌గ‌న్‌ను క‌నీసం పోన్‌లో కూడా ప‌రామ‌ర్శించ‌ని బాబు ఎక్క‌డ జ‌గ‌న్‌కు మైలేజి అవుతుందోన‌నే క‌డుపు మంట‌తో హతయాయత్నం ఘటనను చాలా చులకనగా మాట్లాడారు. కోడి క‌త్తి డ్రామా అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

ఇవన్నీ చూసేవాళ్ళకు హత్యాయత్నం ఘటనను చంద్రబాబు కావాలనే చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ..ఇటు ప్ర‌జ‌ల్లోనూ వ్య‌క్తం అవుతున్నాయి. నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణ తీరు కూడా అనుమానాలను కలిగించాయి. ఆ ఘ‌ట‌న‌కు అస‌లు సూత్ర‌దారులు ఎవ‌ర‌నే దానిమీద విచార‌ణ చేయ‌కుండా తూతూ మంత్రంగా విచార‌ణ‌ను ముగించారు.

దాడి జ‌రిగిన వెంట‌నే డీజీపీ, చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌లు ఒక దానికొక‌టి పొంత‌న లేకుండా ఉన్నాయి. నిందితుడు నోరు మెదపటం లేదని సిట్ విచారణకు నేతృత్వం వహిస్తున్న మహేష్ చంద్ర లడ్డా పదే పదే చెప్పటంతో అనుమానాలు ఎక్కువైపోయాయి. ఈ రెండు విష‌యాల‌ను జ‌గ‌న్ త‌రుపు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెల్ల‌డంలో స‌ఫ‌లం అయ్యార‌నే చెప్ప వ‌చ్చు.

అదే సమయంలో హత్యాయత్నం ఘటనపై ప్రభుత్వ తరపు లాయర్ వాదన తేలిపోయిందని సమాచారం. అందుకనే సిట్ విచారణ నివేదిక మొత్తాన్ని తమకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. నివేదిక అందిన త‌ర్వాత దాన్ని ప‌రిశీలించి కోర్టు ఒక అభిప్రాయానికి వ‌స్తుంది.

ఒక వేల జ‌గ‌న్ కోరుతున్న‌ట్లు స్వతంత్ర సంస్ధతో విచారణ చేయించాలా ? లేకపోతే సిబిఐతో విచారణ చేయించాల అన్నది తేలుస్తుంది. ఏదేమైనా విచారణ విధానంలో లోపాలే జగన్ వాదనకు బలం చేకూరుస్తున్నట్లు అర్ధమైపోతోంది. సీబీఐ లేదా థ‌ర్డ్ పార్టీ విచార‌ణ‌కు ఆదేశిస్తే బాబుబే త‌న రాజ‌కీయానికి స‌మాధి క‌ట్టుకున్న‌ట్లు అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -