Saturday, May 4, 2024
- Advertisement -

అప్పుడే సంక్రాంతికి చక్రం తిప్పేస్తున్నారు

- Advertisement -

సంక్రాంతి వచ్చిదంటే పెద్ద చిత్రాల సందడి అలా ఇలా ఉండదు. ఎక్కడ చూసినా..రాబోయె వసూళ్ల గురించే కబుర్లు. ఆ టైమ్లో చిన్న సినిమాలు ఎలాగూ ఉండవు కాబట్టి అందరూ ఈ బడా పిక్చర్స్ పైనే ఫోకస్ పెడుతూ ఉంటారు. గత కొంతకాలంగా ఫిలిం కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం సంక్రాంతి టైంలో పరభాష చిత్రాలు విడుదల కాకుండా గేమ్ ఆడుతున్నారు.

అందుల్లోను టాప్ పిక్చర్స్ అయినప్పటికీ… ఏసినిమా రిలీజ్ కు నోచుకోకుండా చేస్తున్నారు. రజనీ,సూర్య సినిమాలు ఆటైమ్లో విడుదలకు నోచుకోలేవు.తాజాగా అదే పరిస్థితి ఇపుడు వచ్చింది. సూర్య ,రజనీలు సంక్రాంతికి తెలుగులోకి రాకుండా పోతున్నారు. రజనీ సినిమా లేట్ అవుతోంది కాబట్టి వేరేలా అనుకోవచ్చు. ఒకవేల ఇన్ టైమ్ కు వచ్చినా…ఇక్కడ పొంగల్ రేసులో నిలబడకుండి చేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో మన బడా బాబుల సినిమాలు వస్తున్నాయని ఇలా చేస్తున్నారు సరే. మరి చిన్న చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అయ్యే ఫిబ్రవరి ,జూన్ ,జూలైలో కూడా ఇదే విధానం అవలంబిస్తే భాగుంటుంది కదా. అపుడు అలా ఎందుకు చేయడం లేదు. అంటే ఇక్కడ పెద్దోళ్ల చిత్రాలే బడా సినిమాలు.. చిన్న సినిమాలు అసలు సినిమాలే కావనా.ఒకసారి పునపరిశీలన చేస్తే ఏది మంచో ఏది చెడో పెద్దలకు భాగా అర్ధమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -