వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం వరకూ వచ్చిన పెళ్లిని రద్దు చేసుకొంది త్రిష. అసలు రీజన్లు బయటకు రాలేదు కానీ.. త్రిష ఆ వ్యవహారం నిశ్చితార్థంతోనే ఆగిపోతున్నట్టుగా..
ఇప్పుడు తాను ఒక ఫ్రీ బర్డ్ అని చెప్పుకొచ్చింది. ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఆ ఆనందం ఆమెకు ఎక్కువ సేపు కొనసాగడం లేదు. ఇప్పుడు త్రిషకు మళ్లీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.. అదేమిటంటే.. ‘లయన్’ ఊసురుమనిపించింది.
ఈ సినిమాపై త్రిష ఎన్నో ఆశలు పెట్టుకొంది. అది కాస్తా తుస్సుమనడంతో త్రిష తీవ్ర నిరాశపడుతోంది. అవకాశాలు బాగానే ఉన్నా.. త్రిషకు అర్జెంటుగా ఒక హిట్ అవసరం. ఒకరకంగా చూస్తే ఈమెకు గత ఏడు సంవత్సరాల్లో ఒక్క హిట్టు కూడా లేదు! అయినా అలాగే బండి లాగిస్తోంది. నిర్మాతలు, దర్శకులు అవకాశాలు ఇస్తున్నాయి. మరోవైపు వయసు మీదపడుతోంది. ఇప్పుడు హిట్ ఉంటే తప్ప విలువ ఉండదు.
చేతిలో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి అయితే.. ఆమెకు మళ్లీ అవకాశాలు లభిస్తాయన్న గ్యారెంటీ లేదు. ఈ సినిమాలు ఏవైనా హిట్ అయితే మాత్రమే.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి. అలాగాక ‘లయన్ ‘ తరమా హా సినిమాలు చేస్తూ పోతే మాత్రం కొత్త అవకాశాలు తగ్గిపోతాయి. దీంతో ఇప్పుడు త్రిష కొంత ఆందోళనకు లోనవుతోంది. మరి చేతిలో ఉన్న మిగతా సినిమాలు అయినా.. త్రిషకు ఊరటిస్తాయో లేదో చూడాలి!