Sunday, May 5, 2024
- Advertisement -

త్రివిక్రమ్ రేంజ్ చాలా పెరిగిపోయింది…!

- Advertisement -

దర్శకుడు త్రివిక్రమ్ స్థాయి పెరిగింది. ఒకవైపు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఫెయిల్యూర్ తర్వాత పెద్ద హీరోల సినిమాలేవీ చేతిలో లేకుండా పోయి.. నితిన్ తో “అ..ఆ” చేసుకుంటున్న త్రివిక్రమ్ కు ఇప్పుడు ఒక జాక్ పాట్ తగిలింది.

ఈ దర్శక, రచయితతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు సూర్య. ప్రస్తుతం వీళ్లిద్దరూ తమ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయగానే… జత కలవనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ నితిన్ తో సినిమాను పూర్తి చేసుకుని, అంతలోపు సూర్య కూడా సింగం త్రీ ని పూర్తి చేస్తే.. ఈ దర్శక, హీరోలు ఫ్రీ అవుతారని తెలుస్తోంది. అలా ఈ ఇద్దరి కాంబినేషన్ కుదిరే అవకాశం ఉందని సమాచారం.

మరి త్రివిక్రమ్ కు ఇది కచ్చితంగా మంచి ఛాన్సే. సూర్యతో సినిమా అంటే.. అది ద్విభాష చిత్రం కూడా అవుతుంది. దర్శకుడి ఇమేజ్ తో తెలుగులో… హీరో ఇమేజ్ తో తమిళంలో ఈ సినిమాపై హైప్ పెరిగే అవకాశం ఉంది. భారీ బడ్జెట్టు.. భారీ వసూళ్లు రెండూ కుదిరే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లిద్దరిదీ క్రేజీ కాంబినేషన్ అవుతుంది.

అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ప్రస్తుతం త్రివిక్రమ్ తన చేతిలో ఉన్న సినిమాను హిట్ చేసుకుంటేనే.. సూర్యతో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -