Saturday, May 18, 2024
- Advertisement -

లాభాలు అనుకుంటే.. రామ్ చరణ్ నష్టపరిహారాలు కట్టిస్తున్నాడు!

- Advertisement -

‘బ్రూస్ లీ’ తో రికార్డులు బద్దలైపోతాయని అనుకున్నరంతా. మెగా పవర్ స్టార్ ఏదో అద్భుతాన్ని సాధిస్తాడని.. వంద కోట్ల రూపాయల రేంజ్ కలెక్షన్ల స్థాయిలో  పిక్చరుంటుందని చాలా మంది ఎక్స్ పెక్ట్ చేశారు. ఈసినిమాపై అభిమానుల అంచనాలకు అయితే లోటే లేదు. అలాంటి నేపథ్యంలో విడుదలైన ఆ సినిమా ఢామ్అంది.

సినిమా విడుదలై చాలా రోజులే గడిచిపోయినా.. ఇంకా ఆ సినిమా నష్టపరిహారాల లెక్కలు మాత్రం వినిపిస్తున్నాయి. మామూలుగా కలెక్షన్ల రికార్డులను, నిర్మాతలకు, బయ్యర్లకు వచ్చిన లాభాల గురించి మాట్లాడుకోవాల్సిన సమయంలో… బ్రూస్ లీ విషయంలో నష్టపరిహారం అంశాలు చర్చలోకి వస్తున్నాయి.

ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిలాయని సమాచారం. భారీ ధర పెట్టి కొనుక్కొన్న సినిమా కాస్తా ఫెయిల్యూర్ కావడంతో రాజు.. నష్టపోయాడు. దీంతో ఓవరాల్ గా ఐదారు కోట్ల రూపాయల వరకూ ఆయన నష్టోయినట్టుగా తెలుస్తోంది. మరి ఒక ఏరియా పంపిణీదారు ఇలా నష్టపోవడం అంటే మాటలు కాదు.

దీంతో ఆయన తనకు పరిహారం కట్టివాలని నిర్మాతను కోరినట్టుగా సమాచారం. దీనిపై నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పంచాయతీ చేసిన పెద్దలు చివరకు రెండు కోట్ల రూపాయల పరిహారానికి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. హీరో రామ్ చరణ్ ఈ పరిహారం కట్టించకపోయినా.. ఆయనతో సినిమా తీసిన నిర్మాతలు మాత్రం లాభాల గురించి గాక.. ఇలా పరిహారాలు చెల్లించాల్సి వస్తోంది. అదీ కథ. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -