Tuesday, May 6, 2025
- Advertisement -

త్రివిక్రమ్ కన్ను ఇప్పుడు ఆమె మీద పడింది

- Advertisement -

త్రివిక్రమ్ కన్ను తెలుగు హీరోయిన్ ల కన్నా తమిళ, మలయాళం హీరోయిన్ ల మీద ఎక్కువగా పడుతూ ఉన్నట్టు అనిపిస్తోంది.

మొన్ననే అనుపమ పరమేశ్వరన్ అంటూ ప్రేమం మూవీ ఫేం పిల్లని తన కొత్త సినిమా “అ ఆ ” లో పెట్టుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా కి తమిళ పిల్ల అనన్య ని కూడా తీసుకుని వస్తున్నారు అని టాక్ నడుస్తోంది. 

‘జర్నీ’ సినిమాతో తమిళ – తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అనన్య. ఐతే సినిమాలో అనన్య హీరోయిన్ కాదు. ఆమె నితిన్ సిస్టర్ గా నటిస్తోందట. ఐతే కథను మలుపు తిప్పే పాత్ర ఆమెదని తెలిసింది. జర్నీ తరవాత ఆమెకి తెలుగు లో పరవాలేదు అనిపించుకునే అవకాశాలు వచ్చాయి . ఇంటింటా అన్నమయ్య , అమాయకుడు లాంటి సినిమాలు ఆమె చేసింది. అమాయకుడు సంగతీ ఎవరికీ తెలీదు , అన్నమయ్య సినిమా విడుదల కూడా కాలేదు. 

జర్నీ తరవాత తమిళం లో మంచి స్థానం దక్కినా కూడా వ్యాపార వేత్త ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది ఆమె. అతను రెండవ పెళ్లి వాడు అన్న విషయం పెళ్ళయ్యాక కానీ ఆమెకి తెలీలేదు అయినా అతన్ని మన్నించి అతనితోనే ఉంటోంది. రెండు మూడేళ్ళు సినిమాల కి దూరంగా ఉన్న ఆమె తెలుగు లో త్రివిక్రమ్ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తోంది 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -