Wednesday, May 15, 2024
- Advertisement -

త్రివిక్ర‌మ్ కోసం ఆ డైరెక్ట‌ర్‌ని ప‌క్క‌న పెడుతున్న బ‌న్నీ…?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ సినిమా ‘నాపేరు సూర్య’ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఫైనలైజ్ చేసే విషయంలో చాలా సమయం తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ తాజాగా ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఫైనల్ అయిన సినిమా ..అదిగో ఇదిగో అంటున్నారు గానీ అది ఇప్పుడు హోల్డ్ లోకి వెళ్లిందంట‌.

విక్రమ్ కుమార్ కథ వినిపించాడనీ, ఆయన చెప్పిన మార్పులు చేర్పులు చేస్తున్నాడని అన్నారు. కానీ అసలు ఈ ప్రాజెక్టునే అల్లు అర్జున్ పక్కన పెట్టేశాడనేది తాజా సమాచారం. విక్రమ్ కుమార్ తో తన నెక్స్ట్ మూవీ చేయాలని అల్లు అర్జున్ అనుకోవడం నిజమే. అయితే విక్రమ్ కుమార్ సినిమాలు ప్రయోగాత్మకంగా ఉంటాయేగానీ, కమర్షియల్ గా భారీ వసూళ్లను సాధించిన దాఖలాలు తక్కువ.

అల్లు అర్జున్ కి ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడవలసిన అవసరం వుంది. అందువలన విక్రమ్ కుమార్ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టేసి .. త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడట. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా తరువాత త్రివిక్రమ్ వేరే ప్రాజెక్టును కమిట్ కాలేదు. అందువలన ఆయనతో చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ వున్నాడని అంటున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. అలా జరిగితే.. విక్రమ్ ఇప్పుడు మరో హీరోను వెతుక్కోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -