ప్రత్యేక ఆయుధాల వినియోగం, వ్యూహరచనలో శిక్షణ పొంది పూర్తిగా మహిళలతో కూడిన దేశంలోనే తొలి స్వాత్ దళం ఢిల్లీ పోలీసు విభాగంలో శుక్రవారం చేరనుంది. కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారింగా ఈ దళాన్ని ఢిల్లీ పోలీస్ విభాగంలో చేర్చనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 36 మంది మహిళా కానిస్టేబుళ్లు దేశ, విదేశాల్లో నిపుణులు శిక్షణలో రాటుదేలారు.
పోలీస్ కమిషన్ అమూల్యా పట్నాయిక్ అధ్వర్యంలో వీరికి పదిహేను నెలల కఠోర శిక్షణ సాగింది. సాధారణంగా కరుడగట్టిన నేరస్థులు, ఉగ్రవాదులను ఎదుర్కొడానికి స్వాత్ దళాలను వినియోగిస్తారు. నగరాల్లో అల్లర్లు, ఉగ్రదాడులను సమర్ధంగా ఎదుర్కొనే సామర్థ్యం వీరికి ఉందని అమూల్యా పట్నాయిక్ తెలిపారు.
పశ్చిమ దేశాల్లో పూర్తిగా మహిళలతో కూడిన స్వాత్ టీమ్‌లు ఏర్పాటుచేయలేదని పట్నాయిక్ పేర్కొనారు. ఈ 36 మంది మహిళల్లో అత్యధికంగా అసోం నుంచి 13 మంది, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్, మణిపూర్‌ల నుంచి ఐదుగురు చొప్పున ఉన్నారు. ఇజ్రాయెల్ క్రావ్ మగా (ఇది ఓ రకమైన ఆత్మరక్షణ విద్య), ఎంపీ5 మెషీన్‌గన్స్, ఆటో పిస్టల్స్ లాంటి ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందారు. వీరిని దక్షిణ, మధ్య ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో నియమించనున్నారు.