Thursday, May 2, 2024
- Advertisement -

మన్మధుడు 2: అందరికన్నా సంతోషం ఎక్కువ ఎవరికో తెలుసా

- Advertisement -

నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి కానీ అందులో మన్మధుడు కూడా ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన లో ఈ సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమా పెద్ద విజయం సాధించడమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా మంచి పేరు తీసుకొని వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన ఈ సినిమా ని నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇండస్ట్రీ లో కూడా క్రేజ్ పెరిగింది.

మొన్న మన్మధుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున కనీసం త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా మెన్షన్ చేయకపోవడం అందరికీ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా లో ఎక్కువ శాతం సక్సెస్ క్రెడిట్ త్రివిక్రమ్ కి ఇవ్వాలి కానీ అసలు త్రివిక్రమ్ కి సినిమా కి సంబంధం లేనట్టు గా నాగార్జున క్రెడిట్ మొత్తం దర్శకుడు విజయ్ భాస్కర్ కి ఇచ్చాడు. ఇది ఎవరికీ అంత మంచిగా అనిపించలేదు.

అయితే ఆ తర్వాత వివరణ ఇచ్చే అప్పుడు కూడా త్రివిక్రమ్ కి సినిమా కి సంబంధం లేదు అన్నట్టు గా మాట్లాడాడు నాగార్జున. ఇప్పుడు మన్మధుడు 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా కి వస్తున్న నెగటివ్ రెస్పాన్స్ చూసి త్రివిక్రమ్ అభిమానులు ఫుల్ ఆనందం లో ఉన్నారు. నాగార్జున ఇప్పుడు అయినా త్రివిక్రమ్ విలువ తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -